Sunday, October 6, 2024

ఆంధ్రా తీరంలో వాయుగుండం: ఐఎండి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

భారత వాతావరణ శాఖ ప్రకారం, ప్రస్తుతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాను సర్క్యులేషన్ మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉంది. అదే సమయంలో, దక్షిణ గుజరాత్-కేరళ తీరాల వెంబడి సగటు సముద్ర మట్టం వద్ద ఆఫ్-షోర్ ద్రోణి విస్తరించి ఉంది. ఈ కారణంగా అనేక దక్షిణ , పశ్చిమ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 7 నుండి 10 వరకు కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, కోస్తాంధ్రలో జూలై 8, 9 తేదీలలో ఓ మోస్తరు వానలు పడనున్నాయి.

మధ్య మహారాష్ట్ర , మరాఠ్వాడా, సౌరాష్ట్ర  అండ్ కచ్, కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ యానాం, తెలంగాణ , ఇంటీరియర్ కర్ణాటకలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. తమిళనాడు, పుదుచ్చేరి , కారైకాల్ , రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News