Monday, December 23, 2024

2024-మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ

- Advertisement -
- Advertisement -

ముంబై: సినిమాలు, టీవీ షోలు, ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన IMDB (www.imdb.com) ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల నెలవారీ సందర్శకుల ద్వారా నిర్ణయించబడిన 2024-మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది.

ఈ సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచిన ఫైటర్ (2024 మోస్ట్ అవైటెడ్ మూవీ) ప్రధాన నటుడు హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. “ఐఎండిబి లో ఫైటర్ 2024 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీ నిలవడం చాలా పాజిటివ్ అప్డేట్. ఫైటర్ టీజర్, పాటలకు గొప్ప స్పందన వచ్చింది. జనవరి 25, 2024 న మా ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించాలని మేము ఆశిస్తున్నాము. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మా సినిమాలో కలుద్దాం” అన్నారు.

2024- మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్

1. ఫైటర్
2. పుష్ప: ది రూల్-పార్ట్ 2
3. వెల్కం టు ది జంగిల్
4. సింగం అగైన్
5. కల్కి 2898 ఎ.డి
6. బఘీరా
7. హనుమాన్
8. బడే మియాన్ ఛోటే మియాన్
9. కంగువ
10. దేవర పార్ట్ 1
11. చావా
12. గుంటూరు కారం
13. మలైకోట్టై వాలిబన్14. మేరీ క్రిస్మస్
15. కెప్టెన్ మిల్లర్
16. తంగలాన్
17. ఇండియన్ 2
18. యోధ
19. మెయిన్ అటల్ హూన్
20. జిగ్రా

2024లో విడుదలయిన భారతీయ సినిమాల్లో ఈ సినిమాలు స్థిరంగా ఐఎండిబి వినియోగదారులలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి ఉన్న వందల మిలియన్ల నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ద్వారా నిర్ణయించబడ్డాయి.

ఐఎండీబీ జాబితాలోని 20 చిత్రాల్లో తొమ్మిది హిందీ సినిమాలు, ఐదు తెలుగు, నాలుగు తమిళ, ఒక మలయాళం, ఒక కన్నడ సినిమా కావడం గమనార్హం. ఫైటర్ (నెం.1), సింగం ఎగైన్ (నెం.4), కల్కి 2898 ఏడీ (నెం.5) చిత్రాల్లో దీపికా పదుకొణె నటిస్తోంది. ఇటీవల ప్రకటించిన ఐఎండీబీ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ ఆఫ్ 2023 జాబితాలో ఆమె 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో నాలుగు చిత్రాలున్నాయి.. పుష్ప: ది రూల్-పార్ట్ 2 (నెం.2), వెల్ కమ్ టు ది జంగిల్ (నెం.3), సింగం ఎగైన్ (నెం.4), ఇండియన్ 2 (నెం.17).

IMDB కస్టమర్ లు అందుబాటులో ఉన్నప్పుడు అలర్ట్ లను పొందడం కొరకు వీటిని, ఇతర టైటిల్స్ ను తమ IMDB వాచ్ లిస్ట్ కు యాడ్ చేసుకోవచ్చు. 2024 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ గురించి మరింత తెలుసుకోవడానికి, ఈ వీడియోను చూడండి/ పూర్తి జాబితాను ఇక్కడ చూడండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News