Monday, December 23, 2024

కేంద్ర ఆహార భద్రత పథకానికి ఐఎంఎఫ్ కితాబు

- Advertisement -
- Advertisement -

IMF lauds PM Modi food security scheme

న్యూఢిల్లీ : రెండేళ్ల క్రితం భారత్‌లో ప్రవేశించిన కరోనా మహమ్మారి దేశ ప్రజల జీవనస్థాయిలపై దెబ్బకొట్టినా కేంద్రం తీసుకు వచ్చిన ఆహార భద్రత పథకం భారత్‌లో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించగలిగిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కితాబిచ్చింది. పాండమిక్, పావర్టీ, ఇనీక్వాలిటీ, ఎవిడెన్స్ ఫ్రమ్ ఇండియా పేరట ఐఎంఎఫ్ ఒక పత్రాన్ని విడుదల చేసింది. 2019 లో భారత్‌లో తీవ్ర పేదరికం ఒక శాతం ( ఒక వ్యక్తికి రోజుకు 1.9 డాలర్ల కంటే తక్కువ కొనుగోలు శక్తి) కంటే దిగువన ఉంది. 2020 లో మహమ్మారి ఆ దేశంలో అడుగుపెట్టిన ఏడాదిలో కూడా అది స్థిరంగానే ఉంది. భారత్‌లో తీవ్రమైన పేదరికం స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కీలకంగా మారింది.

కొవిడ్ షాక్‌లకు గురైన పేదల విషయంలో ఈ పథకం మెరుగ్గా పనిచేసింది. ఇలా తాత్కాలికంగా ఏర్పడిన ఆదాయ అంతరాల నుంచి బయటపడేందుకు తాత్కాలిక ఆర్థిక విధాన జోక్యం తగినది’ అని ఐఎంఎఫ్ వెల్లడించింది. కరోనా వేళ 2020 మార్చిలో కేంద్రం ఈ ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీనికింద దేశ ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించి, ఆహార భద్రతను కల్పించింది. ప్రస్తుతం ఈ పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు పొడిగిస్తున్నట్టు గత నెల ప్రధాని ప్రకటించారు. ఇక వరుసగా రెండు సంవత్సరాల పాటు తక్కువ స్థాయి పేదరికాన్ని తీవ్ర పేదరిక నిర్మూలనగా పరిగణిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News