Friday, November 22, 2024

లైంగిక దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు

- Advertisement -
- Advertisement -

Immediate action against perpetrators of sexual assault

మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి
వారికి మహిళా కమిషన్ భద్రత కల్పిస్తుంది
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : మహిళల పట్ల వివక్ష, లైంగిక దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకునేవిధంగా మహిళా కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, అలాంటి వారికి కమిషన్ భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. సమాజంలో మహిళల పట్ల వివక్ష, దాడులు, అన్యాయాలపై వారికి అవగాహన కల్పించేందుకు జాతీయ మహిళా కమిషన్ సహకారంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం బిర్లా ఆడిటోరియంలో సెమినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మహిళలపై అనైతిక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామన్నారు.

లింగ నిర్ధారణ చేసే క్లినిక్‌లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇలాంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైస్వాల్, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి మురళీ మోహన్‌లు మహిళల సంరక్షణ, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అలాగే మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరిబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుదాంలక్ష్మి, కటారి రేవతిరావు, మహిళా కమిషన్ కార్యదర్వి సునంద, ఆర్‌జెడి శారదా, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News