Monday, December 23, 2024

ఆయుధాలు వదిలిపెట్టండి: ఉక్రెయిన్లకు రష్యా హెచ్చరిక

- Advertisement -
- Advertisement -
battle for Donbas
ఉక్రెయిన్ యుద్ధం 55వ రోజుకు చేరుకుంది. యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పై  రష్యా దాడిని ఉధృతం చేసింది.

మాస్కో: ‘‘తక్షణమే ఆయుధాలు వేయండి”  అంటూ  రష్యా మంగళవారం ఉక్రేనియన్ దళాలను హెచ్చరించింది.  వ్యూహాత్మక ఓడరేవు నగరం మారియుపోల్‌లోని రక్షకులకు ఇలా  హెచ్చరిక చేసింది.  ఉక్రెయిన్  తూర్పు భాగంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న డాన్‌బాస్ ప్రాంతం కోసం యుద్ధం జరిగిన గంటల తర్వాత రష్యా ఈ హెచ్చరిక చేసింది.  కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ సలహాదారు, ఒలెక్సీ అరెస్టోవిచ్, చివరి క్షణం వరకు ప్రతిఘటిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ మాస్కో లాభాలు పొందలేదని అన్నారు. “డాన్‌బాస్ కోసం నిన్న ప్రారంభమైన యుద్ధం కొనసాగుతోంది,  చాలా జాగ్రత్తగా కొనసాగుతోంది. యుద్ధం రష్యాకు అనుకూలంగా కాబోదు” అని అతను చెప్పాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News