Wednesday, December 25, 2024

జల విధ్వంసం

- Advertisement -
- Advertisement -
వరద గాయాలతో తెలంగాణ విలవిల

హైదరాబాద్:  జల యుద్ధంలో కొద్ది గంటల పాటు విరామం దొరికినట్టయింది. గత రెండు రోజులుగా జల దృశ్యాలు బయటకు తేలుతున్నాయి. కళ్లముందే వరద కొట్టుకుపోయిన కుటుంబ మృతదేహాలు ఒక్కటొక్కటిగా ఒడ్డున పడుతున్నాయి. విగతజీవులుగా పడివున్న వాటిని చూసి శోకసముద్రంలో మునిగిన వా రు చేస్తున్న ఆక్రందనలు వరదఘోషను మించిపోతున్నాయి. వరద గ్రామాలకు గ్రామాలే మునకేశాయి. చూస్తుండగానే వ రద మట్టడించింది. కనీసం ఇళ్లలో విలువైన సామన్లను స ర్దుకునే సమయం కూడా లేకుండా పోయింది. విలువైన వాటిని ఉన్నవి ఉన్నట్టుగానే వదిలేసి కట్టుబట్టలతో బతకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగులు తీయాల్సి శుక్రవారం వర్షం కొంత తగ్గుముఖం పట్టినా ఇంకా పదుల సంఖ్యలో గ్రామాలు జల మునిగి తేలుతున్నాయి. వరద తగ్గిన ప్రాంతాల్లో ఇంటి దారిపట్టిన ప్రజలకు ఇళ్లలో మిగిలిన బు రద తప్ప మరేమీ కనిపించడం లేదు. వంటసామగ్రి వరదనీటిలో కొట్టుకుపోయింది. సిలిండర్లు దూదిపింజల్లా తేలిపోయాయి. తిం డిగింజలు బురదలో కుళ్లిపోయాయి. మంచాలు, పరుపులు చివికిపోయాయి. ఇంటా బయటా గోడలకు బురద పేరుకుపోయింది. ప్రాణ సమానంగా పెంచుకున్న పశువులు పాడిగేదెలు వరదనీట మునిగి కళేబరాలై తేలుతున్నాయి. కోళ్లు ఆచూకీ లేకుండా పోయాయి. అక్కడక్కడా మిగిలిన కొద్దిపాటి ఆనవాళ్లను చూసి కన్నీటి వరద పొంగుకొస్తోంది. భారీ వర్షాలు వరదలు చేసిన గాయాలతో ఉత్తర తెలంగాణం విలవిలలాడుతోంది.
పెరుగుతున్న గల్లంతు ..మృతులు
భారీ వర్షాలు వరదలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు కాజ్‌వేలు దాటే ప్రయత్నంలో గల్లంతైన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒక్క ములుగు జిల్లాలోనే 18మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. జంపన్న వాగులో గల్లంతైన వారి మృతదేహాల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృం దా లు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీశాయి. ఇంకా మరి కొందరికోసం జంపన్న వాగును జల్లెడ పడుతున్నాయి. వరద ఉధృతికి కొట్టుకుపోయి కరెంట్ తీగలపై విగతజీవిగా వేళ్లాడుతున్న మృతదేహం కఠిన హృదయాలను సైతం కరిగించివేస్తోంది. కరీంనగర్ జిల్లా ఎల్లమ్మవాగులో రైతు రాజయ్య కోట్టుకుపోయాడు. కొమరంభీం జిల్లా మొరంవాగులో కొట్టుకుపోతున్న బాలుడిని రక్షించే ప్రయత్నంలో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండ లం భవానీపేటపోతారం మధ్య వాగు ఉధృతిలో పది గొర్రెలు కొట్టుకుపోయాయి.
జలదిగ్బంధంలోనే గ్రామాలు
భారీ వర్షాలు వరదల ధాటికి లోతట్టు ప్రాంతాల్లోని పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుబడి ఉన్నాయి.ములుగుజిల్లా ఏటూరునాగారం మం డలం కొండాయి, ముత్యాల, దొడ్ల తదితర ఏజెన్సీ గ్రామాలు చుట్టుముట్టిన వరదనీటిలో దిగ్భందానికి లోనయ్యాయి. పడవల సాయంతో కొండాయి గ్రా మంలోకి వేళ్లేందుకుఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు సైతం సాధ్యం కావటంలేదు. జలమార్గాల్లో వరద సహాయక చర్యలు ముందుకు సాగటం లేదు.ప్రాణాలు అరచేత పెట్టుకుని మిద్దెలపైకెక్కి ఆకలి దప్పులతో బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రత్యేక బృందా లు హెలికాప్టర్ సాయంతో ఆహార పొట్లాలు నీటి క్యాన్లను ఔషధాలను జారవిడుస్తున్నారు. వాటిని బా ధితులకు సమీపాన ఇళ్లపైన జారవిడిచేందుకు కూ డా వాతావరణం అంతగా అనుకూలించటం లేదు. నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల గ్రామం చెరువుకు గండి పడి గ్రామాన్ని చెరువు నీరు ముంచెత్తిం ది. ప్రాణ భయంతో జనం ఇల్లనుఉంచి మహాదేవి గుట్టపైకి పరుగులు తీశారు. 150కుంటుంబాలు రా త్రి నుంచి జాగరణం చేస్తున్నాయి. కరీం నగర్ జిల్లా శంకరపట్నం మండంల కల్వల ప్రాజెక్టుకు గండి పడింది. వీణవంక, జమ్మికుంట మండలాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. మానేరు నది పరివాహక గ్రామాలను అప్రమత్తం చేశారు. వరంగల్ జిల్లా రం గంపేటలో వరదనీట చిక్కుకున్న బాధితులను పడవల సాయంతో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తెస్తున్నాయి. భద్రకాళి అమ్మవారి అన్నదాన సత్రం లో చిక్కుకుపోయిన బాధితులను సురక్షిత ప్రాంతానికి చేరుస్తున్నారు. చుంచుపల్లి మండలం పెనుబల్లి వాగులో వరద పొంగింది.
600 కిలోల ఆహార ప్యాకెట్లు
రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుం బాలకు భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్ట ర్లు 600 కిలోల ఆహార ప్యాకెట్లను జారవిడిచాయి. నిరాశ్రయులైన పలు గ్రామాల్లోని ప్రజలకు శుక్రవా రం హెలికాప్టర్లు ద్వారా ఆహార ప్యాకెట్లును అందిం చారు. ఆహార ప్యాకెట్లలో ’సాంగినీస్’గా ప్రసిద్ధి చెం దిన ఎయిర్ ఫోర్స్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందించిన రిలీఫ్ మెటీరియల్ ఉన్నాయి. ప్రకృతి విధ్వంసం సృష్టించినప్పుడల్లా ఐఎఎఫ్ సి బ్బంది తమవంతు సహాయం అందిస్తున్నారు. హకీం పేట్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన హెలికా ప్టర్లు భూపాలపల్లి జిల్లాలో వరద ముంపు ప్రాంతా ల్లో ఈ ఆహార ప్యాకెట్లను జారవిడిచాయి. నైనపాక గ్రామంలో జెసిబిపై చిక్కుకు పోయిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు.
పొరుగు రాష్ట్రాలకు తెగిన సంబంధాలు
భారీ వరదల ఉధృతి కారణంగా పలు మార్గాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు కోసుకుపోయాయి.ఆయా మార్గాల్లో తెలంగాణతో ఇరుగు పొ రుగు రాష్ట్రాలకు సంబంధాలు తెగిపోయాయి. మహారాష్ట్ర , చత్తిస్‌గఢ్ ,ఏపితో పలు మార్గాల్లో తెలంగాణకు రాకపోలకు నిలిచి పోయాయి.ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి జాతీయరహదారిపై నుంచి తగ్గేదేలే అంటోంది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ విజయవాడ మధ్య నడిచే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద దారి మళ్లించారు. నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం బినోల వద్ద రహాదారి కోతకు గురైంది. ములుగు జిలా వాజేడు మండలం గోదావరి వంతనెపైన ఉధృంతగా ప్రవహిస్తోంది. తెలగాణచత్తిస్‌గఢ్ మద్య రాకపోకలు నిలిచిపోయాయి. పరకాల చలివాగు ఉధృతికి వంతెనకొట్టుకుపోయింది ఈ మార్గం లో రాకపోకలు నిలిచి పోయాయి. కటాక్ష చెరువు నీటి ఉధృతికి ములుగు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా వెంకలగడ్డ వాగు ఉధృతికి మహదేవ్‌పూర్‌పలిమెల మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మున్నేరు వాగు ఉధృతికి రోడ్లు కోతకు గురయ్యాయి.మహబూబాబాద్‌నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాకా ల వరద ఉధృతికి గూడురు నెక్కండ మధ్య సంబంధాలు తెగిపోయాయి. గార్ల , రాంపురం మార్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జగిత్యాల అనంతారం వద్ద వంతెన కొట్టుకుపోయింది. ధర్మపురిమంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట బస్వాపురం వద్ద మొయితెమ్మెద ఉధృతంగా ప్రవహిస్తోంది. సిద్దిపేటహుస్నాబాద్ హన్మకొండ మధ్యరాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభీమ్ జిల్లాలో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తూ పారిగాం రోడ్లపైకి పొంగింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచి పోయాయి. మెదక్‌జల్లా ఎల్కతుర్తి మార్గంలో రోడ్డు తెగిపోయి రామాయం పేట మార్గంలో రాకపోకలు నిలిచి పోయాయి.
మోయ తుమ్మెద వాగులో కారు గల్లంతు
నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామ వాగు దాటుతున్న క్రమంలో ఇం డికా కారు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తిరుపతి తెలిపారు. కోహెడ మండలం పోరెడ్డిపల్లి నుంచి అక్కెన్నపెల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. తాము మరోపక్క ఉండి హెచ్చరించినప్పటికీ కారు రివర్స్‌లో వేగంగా ప్రవాహం దాటే క్రమంలో నీళ్లలోకి రాగానే లైట్లు ఆగిపోయి తర్వాత కారు కనబడలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత సంఘటన స్థలానికి చేరుకొని వివరాలపై ఆరా తీశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News