Sunday, January 19, 2025

గణేశ్ విగ్రహాల నిమజ్జనం… మహారాష్ట్రలో 20 మంది మ

- Advertisement -
- Advertisement -

Immersion of Ganesh idols... 20 people died in Maharashtra

ముంబై : మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా 20 మంది చనిపోయారని పోలీసులు శనివారం తెలిపారు. వీరిలో 14 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వార్ధా జిల్లా సావంగిలో ముగ్గురు నీట మునిగి చనిపోగా, దేవ్లీలో ఇదే విధంగా మరొకరు మృతి చెందారు. యావత్మాల్ జిల్లాలో విగ్రహం నిమజ్జనం చేస్తుండగా చెరువులో మునిగి ఇద్దరు చనిపోయారు. అహ్మద్ నగర్ జిల్లాలో సూపా, బెల్వండి ప్రాంతాల్లో ఇద్దరు, ఉత్తర మహారాష్ట్ర జలగావ్‌లో మరో ఇద్దరు మృతి చెందారు. పుణె జిల్లా ఘొడెగావ్, యావత్ ప్రాంతాల్లో ధూలే జిల్లాలోను, సతారా జిల్లా లోనికాండ్, సోలాపూర్ నగరం లోను ఒక్కొక్కరు వంతున మృతి చెందారు. నాగపూర్ నగరం సక్కర్‌దార ఏరియాలో గణేశ్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. థానేలో కొల్బాడ్ ఏరియాలో భారీ వర్షాలకు శుక్రవారం రాత్రి గణేశ్ పెండాల్‌పై చెట్టుకూలి, 55 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. రాయిగడ్ జిల్లా పన్వేల్‌లో శుక్రవారం సాయంత్రం ఊరేగింపు సందర్భంగా కరెంట్ షాక్ తగిలి 11 మంది గాయపడ్డారు.

ఘర్షణలు

నిమజ్జనం సందర్భంగా కొన్ని ఘర్షణలు కూడా జరిగాయి. అహ్మద్ నగర్ జిల్లా టొఫ్‌ఖానా వద్ద మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే , శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే మద్దతుదార్ల మధ్య జరిగిన కుమ్ములాటలు జరిగాయి. పుణె నగరంలో ముంధ్వా వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో జలగావ్‌లో మేయర్ బంగ్లాపై కొందరు అల్లరి మూకలు రాళ్లు విసిరారు. పుణె జిల్లా షిక్రాపూర్ వద్ద బాణాసంచా కాలుస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అలాగే చంద్రాపూర్‌లో గణేశ్ మండపం వాలంటీర్లకు, పోలీసులకు మధ్య గొడవలు జరిగాయి. ముంబైలో గణేశ్ పర్వదినం, నిమజ్జనం ఊరేగింపులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయని పోలీస్ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News