Wednesday, January 22, 2025

లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య యత్నం

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్: పోలీస్‌లకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె శ్రీగురురామ్ దాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఏఐ 169 విమానంలో లండన్ వెళ్లడానికి బయలుదేరుతుండగా గురువారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఆమెను అడ్డుకున్నారు. లుక్‌అవుట్ నోటీసుల నేపథ్యంలో ఆమె బ్రిటన్ వెళ్లేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరాకరించారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఆమెను అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు. అమృత్‌పాల్ సింగ్ మార్చి 18నుంచి పోలీస్‌ల కళ్లు గప్పి అనేక వేషాలు వేసి, వాహనాలు మార్చి తిరుగుతున్నాడు.

పోలీసులకు లొంగిపోతాడని ప్రచారం జరిగినా అలా జరగలేదు. తా ను దేశం విడిచి పారిపోలేదని, త్వరలోనే అందరి ముం దుకు వస్తానని ఆయన చెప్పినట్టు ఒక వీడియో ఇటీవల బయటకు వచ్చింది. అమృత్‌పాల్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను, మరికొందరిని పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారిస్ పంజాబ్ దే సంస్థకు విదేశీ నిథులను సమకూర్చడంలో భార్య కిరణ్‌దీప్ కౌర్ కీలక పాత్ర పో షించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యం లో కిరణ్ దీప్ కౌర్ కదలికలపై నిఘా ఉంచడంతోపాటు లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. కిరణ్ దీప్ కౌర్ ఎన్‌ఆర్‌ఐ. ఆమె పంజాబ్‌లో పుట్టినప్పటికీ, తల్లిదండ్రు లు బ్రిటన్‌లో స్థిరపడడంతో అక్కడే పెరిగింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన అమృత్‌పాల్ సింగ్‌ను గత ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఆమె పంజాబ్‌లోనే ఉంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News