శరీరం రోగనిరోధక శక్తిని కలిగి ఉంటే ఏ రోగాలు దరిచేరవు. లేకుంటే ప్రతి చిన్న దానికీ శరీరం సహకరించక జలుబు దగ్గులాంటివి వెంటాడుతుంటాయి. ఈ కాలంలో చాలా మందికి గొంతునొప్పి, దగ్గుతో బాధపడుతున్నారు. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ సమస్య వస్తోంది. మరి ఇమ్యూనిటీ సిస్టమ్‌ను పెంచుకోవాలంటే ఏంచేయాలో తెలుసుకుందాం…
రోగనిరోధక శక్తి ఉండటం వల్ల శరీరం వ్యాధులతో పోరాడుతుంది. మంచి ఆరోగ్యం కావాలంటే జీవన విధానం, పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తాయి.
1. కంటినిండా నిద్రపోవాలి: ప్రతి మనిషికి రోజూ ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా కావాలి. కానీ ప్రస్తుత ఉద్యోగ విధుల వల్ల వీలుకావడం లేదు. రాత్రిపూట విధులు నిర్వర్తించేవారికి మరింత నిద్ర మరింత సమస్యగా మారుతోంది. అలాకాకుండా మంచి నిద్రకు ప్రణాళిక వేసుకోవాలి. పడుకునేముందు గ్యాడ్జెట్‌లను దూరంగా పెట్టాలి. ఎక్కువ సేపు టీవీ చూడటం తగ్గించాలి. పడుకునే ముందు మంచి సంగీతం వినడం మంచిది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటుచేసుకోవాలి.
2. పొగతాగడాన్ని మానేయండి: పొగతాగడం, మద్యం తాగడంలాంటి అలవాట్లు స్టేటస్ సింబల్‌గా మారుతోంది. ఇలాంటి అలవాట్ల వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది. త్వరగా ఆరోగ్యం పాడవుతుంది. స్మోకింగ్ చేస్తే ఎన్నో రకాల క్యాన్సర్ వ్యాధులు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
3. నీటిని బాగా తాగాలి: నీళ్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. కూరగాయల్లో కావల సినంతగా కాల్షియం, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కేవలం బలం ఇవ్వడమే కాదు రోగాలతో పోరాడే శక్తిని కూడా పెంచుతాయి.
4. పెరుగు తప్పనిసరి: మన శరీరంలో మంచి, చెడు రెండు రకాల బ్యాక్టీరియా ఎక్కువ పెరిగితే మనం తొందరగా అనారోగ్యానికి గురవుతాం. అందుకే పెరుగును భోజనంలో చేర్చుకోవడం తప్పనిసరి. ఇది మీ ఇమ్యూనిటీ పెంచుతుంది. శరీరానికి విటమిన్ ‘డి’ తప్పనిసరిగా అవసరం.
5. నట్స్ తీసుకోండి: డ్రైఫ్రూట్స్‌ని జనం ఎక్కువగా తినరు. తాము ఎక్కడ లావెక్కిపోతామోనని వారి భయం. కానీ వాస్తవానికి ఇది వారి మనసులో ఉన్న భ్రమ. ఎందుకంటే డ్రైఫ్రూట్స్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ లాంటివి అధిక మోతాదులో ఉండటంతో ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇలాంటి అలవాట్లు ఆహారంతోపాటు ఎంత బిజీగా ఉన్నాసరే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం మర్చిపోకూడదు. ఉదయం 15 20 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాదు, బరువు కూడా పెరగనివ్వదు. శరీరం రోగాలతో పోరాడే శక్తిని పెంచుతుంది.