కొవిడ్ నిబంధనలు పాటించకుంటే ముప్పు తప్పదు
మాస్కులు, శానిటైజర్, వ్యక్తుల మధ్య భౌతికదూరం తప్పనిసరి
బార్లు, సినిమా థియేటర్లు నడిపిస్తే వైరస్ విస్తరించే అవకాశం
లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలి
నగర ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలంటున్న వైద్యాధికారులు
హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి కోరలు చాచి ప్రజలను భయందోళనకు గురిచేస్తుంది. గత నాలుగు రోజుల నుంచి పాజిటివ్ కేసులు సెంచరీకి చేరుకోవడంతో నగర ప్రజలు వైరస్ మరోసారి విజృంభిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా బయపడుతున్న కేసుల్లో అత్యధికంగా పాఠశాల, వసతి గృహాలకు చెందిన విద్యార్థ్దులే. పాఠశాలల నిర్వహకులు కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో కరోనా రెచ్చిపోయి చిన్నారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. వారం రోజులు పాటు వరుసగా బడుల్లోని విద్యార్థ్దులకు రావడంతో ప్రభుత్వం వైద్య, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వైరస్ విజృంభించకుండా ముందు జాగ్రత్తలో చర్యల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ మూసివేయాలని ఆదేశాలివ్వడంతో విద్యాసంస్థ్దలు మూతపడ్డాయి.
వసతిగృహాల్లో ఉండే విద్యార్థ్దులకు సోకగా వారిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లడంతో వారి ద్వారా కేసులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు భావిస్తున్నారు. నగర ప్రజలు గత మూడు నెలల నుంచి కొవిడ్ నిబంధనలు విస్మరించి వ్యాపార సముదాయాల్లో గుంపులుగా తిరగడం, ఆర్టీసి బస్సులు, ఆటోలు, క్యాబ్లో భౌతికదూరం పాటించకుండా ఉండటంతో వైరస్ పెరగడానికి ప్రధాన కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖానికి మాస్కులు ధరించకుండా ఇష్టానుసారంగా రోడ్లపై తిరిగితే కరోనా కాటు బలికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. కిరాణం షాపులు, వస్త్రదుకాణాలు, టిఫిన్, టి సెంటర్ల వద్ద ఒకే దగ్గర చేరడంతో మళ్లీ ప్రమాదకర పరిస్థ్దితులు వస్తున్నాయని చెబుతున్నారు. ఇకా ప్రైవేటు స్కూళ్లు, కళాశాల యాజమాన్యాలు ప్రారంభంలో వారం రోజుల పాటు కొవిడ్ నిబంధనలు తూతూమంత్రంగా పాటించి, తరువాత ఫీజుల వేటలో పడ్డారు.
దగ్గు, జలుబు లక్షణాలున్న విద్యార్థ్దులను గుర్తించకుండా తరగతి గదిలో 20మందికిపైగా విద్యార్దులను చేర్చి పాఠాలు బోధించడంతో ఒకరి నుంచి ఒకరి వైరస్ సోకిందని, సిబ్బంది నిర్లక్షంతో కరోనా రెక్కలు కట్టుకుంటుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. వైరస్ పట్ల భద్రంగా ఉండకపోతే సేకండ్వేవ్ విరుచుకపడుతుందని, రోడ్లపై, దుకాణాల ముందు ఇష్టానుసారంగా ఉండకుండ, వ్యక్తుల అరు అడుగుల దూరం పాటించి, ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్షం చేయకుండా సమీపంలో ఉంటే పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీదవఖానలో టెస్టులు చేయించుకోవాలని, టీకా అందుబాటులో ఉంటే రూ. 250లు చెల్లించి తీసుకుంటే వైరస్ రాదని భావించకుండా, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. బార్లు, సిమ్మింగ్పూల్స్, సినిమా థియేటర్లు నడుస్తుండటంతో వైరస్ విస్తరించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని,వాటిని మూసివేస్తే ముందు రోజుల్లో మహమ్మారి పరుగులు పెట్టకుండా ముక్కుతాడు వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.