Saturday, December 21, 2024

మూడు రోజులు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

8జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
కలెక్టర్లను అప్రమత్తం చేసిన సిఎస్
కంట్రోల్ రూంల ఏర్పాటుకు ఆదేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. అల్పపీడనం వావయువ్య బంగాళాఖాతంలో పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్ , ఉత్తర ఒరిస్సా తీరాలలో కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న అవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మి ఎత్తు వరకు వ్యాపించింది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రాగల మూడు రోజులు ఉత్తర ఒరిస్సా, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా వెళ్లే అవాకాశం ఉంది. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ , వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రంపైపునకు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి:సిఎస్
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కారద్యర్శి శాంతి కుమారి శుక్రవారం నాడు అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని , వర్షాల పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తూ ఉండాలని సిఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News