Monday, February 3, 2025

పోస్ట్ మోడర్నిజం ఆంగ్ల-తెలుగు సాహిత్యాలపై ప్రభావం

- Advertisement -
- Advertisement -

పోస్ట్ మోడర్నిజం, 20వ శతాబ్దం మధ్య భాగంలో ఉద్భవించిన సాంస్కృతిక, బౌద్ధిక ఉద్యమం. ఈ ఉద్యమం సాహిత్యాన్ని విప్లవాత్మకంగా మా ర్చింది. అనాదిగా వాడుకలో ఉన్న స్థాపిత నియమ, నిబంధనలు, సంప్రదాయాలు, అలాగే ఆధిపత్యాలను ఇది సవాలు చేసింది. మానవ అభిప్రాయాలలోని పలు కోణాలను వెలుగులోకి తెచ్చింది. ఆంగ్ల సాహిత్యంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా కనపడుతున్నప్పటికీ, ప్రాంతీయ భాషలైన తెలుగు వంటి భాషా, సాహిత్యలపై దీని ప్రభావం, స్ఫూర్తి కొంత ఆలస్యంగా విస్తరించింది.

ఆంగ్ల సాహిత్యంపై పోస్ట్
మోడర్నిజం, ప్రభావం
ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ మోడర్నిజం, ఆధునికతపై తిరుగుబాటుగా ఉద్భవించింది. ఆధునిక సాహిత్యం క్రమబద్ధత, విశ్వసనీయత, ఏకైక వాస్తవం వంటి భావాలను సమర్థిస్తే, పోస్ట్ మోడ ర్నిజం, వాటిని విస్మరించి, తిరస్కరించి, విచ్ఛిన్నత, భిన్నత్వాల ను చూపింది. సంప్రదాయబద్ధం గా వస్తున్న కథనాల (నారేటివ్ ల) పతనాన్ని ప్రోత్సహించింది. మూస ఆంక్షల అవధులు దాటింది.

థామస్ పించన్, సల్మాన్ రుష్దీ, మార్గరెట్ అట్వుడ్ వంటి ప్రముఖ రచయితలు తాము రచించిన నవలల ద్వారా వినూత్న శైలిని (జానర్) మేళవిస్తూ, మధ్యవర్తిత్వం, వాస్తవికత మధ్య ఉన్న సరిహద్దులను ప్రశ్నించారు. ఉదాహరణకు, పించన్ రచించిన ‘గ్రావిటీస్ రేన్బో’ పుస్తకం విచ్ఛిన్నమైన నిర్మాణాన్ని కలిగి ఉంది, స్థాపిత వ్యవస్థలపై భిన్నమైన వ్యతిరేక దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. అట్వుడ్ రచించిన ‘ది హ్యాండ్మెయిడ్’స్ టేల్ మెటాఫిక్షన్, డిస్టోపియన్ థీమ్‌లను ఉపయోగించి పితృస్వామ్యంపై, అధికార వ్యవస్థలపై తీవ్ర విమర్శలు చేస్తుంది.
ఈ సాహిత్య ప్రక్రియలో అధికారం, వ్యక్తిత్వం, అలాగే సాంస్కృతిక విభజనల పతనం వంటి అం శాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, రుష్దీ రచించిన ‘మిడ్నై’స్’ ’చిల్డ్రెన్ మ్యాజిక్’ రియలిజాన్ని ఉపయోగించి చారిత్రక కథలను పురాణలను ఫాంటసీతో మేళవిస్తుంది.

తెలుగు సాహిత్యంలో పోస్ట్ మోడర్నిజం
తెలుగు సాహిత్యం సాధారణంగా కావ్యం వంటి సంప్రదాయ శైలులకు, సాంఘిక సంస్కరణోద్యమాలకు లోనైనది. 20వ శతాబ్దం చివరి నాటికి పోస్ట్ మోడర్నిజం, ప్రభావం స్పష్టమైంది. రచయితలు స్థాపిత (పాతుకు పోయిన) సామాజిక రాజకీయ వ్యవస్థలను, కుల ఆధిపత్యాన్ని, భాషా స్వచ్ఛతను ప్రశ్నించడం ప్రారంభించారు.
కాశీపట్నం రామరావు (కారా మాస్టర్), బోయ జంగయ్య వంటి రచయితలు తాము రాసిన కథ ల ద్వారా కుల విధానాలను ప్రశ్నిస్తూ, వంచిత వర్గాల అనుభవాలను ప్రతిబింబించారు. ఆంగ్ల సాహిత్యం విశేషంగా ఆడంబరమయిన శైలిని అ నుసరించినా, తెలుగు పోస్ట్ మోడర్నిజం, సామాజిక వాస్తవికతపై, రాజకీయ విమర్శలపై ఎక్కువగా దృష్టి సారించింది.
ఉదాహరణకు, కారా మాస్టర్ కథలు తెలుగులో సంప్రదాయ గ్రామీణ చిత్రాన్ని విచ్ఛిన్నం చేస్తూ, వ్యవసాయ సంక్షోభం, కుల పీడన వంటి వాస్తవాలను ప్రదర్శిస్తాయి. మహిళా రచయిత వోల్గా లాంటి వారు లింగ సమానత్వాన్ని ప్రశ్నిస్తూ, మహిళల సమస్యలను స్వకీయ అనుభ, అనుభూతులను తమదైన శైలిలో నెరవేర్చేందుకు భిన్న కథన నిర్మాణాలను ఉపయోగించారు.

తులనాత్మక విశ్లేషణ
ఆంగ్ల- తెలుగు సాహిత్యాలు పోస్ట్ మోడర్నిజం, ప్ర భావంలో వ్యక్తిత్వం, అధికారం, అణచివేత వంటి అంశాలను విశ్లేషించాయి. అయితే, వాటి దృక్ప థం ఆభివృద్ధి చెందిన భౌగోళిక, సామాజిక సం
స్కృతుల ప్రాతిపదికన భిన్నంగా వ్యక్తమౌతుంది.
ఆంగ్ల సాహిత్యం వ్యంగ్యం, మెటాఫిక్షన్, అలాగే ఇంటర్టెక్స్టువాలిటీ ద్వారా ఈ అంశాలను ప్రతిబింబిస్తే, తెలుగు సాహిత్యం సామాజిక న్యా యం, వాస్తవిక అంశాలపై దృష్టి పెట్టింది. ఉదాహరణకు, జూలియన్ బారన్స్ ఫ్లాబెర్ట్’స్ ప్యారట్ చారిత్రక నిజాలు ప్రశ్నించగా, బోయ జంగ య్య రచనలు కుల వివక్షపై నేరుగా దృష్టి పెడతాయి.

భాషా ప్రయోగం
భాషలో పోస్ట్ మోడ్రనిజం,ప్రభావం రెండు భాషలలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఆంగ్లంలో ‘ప్యాస్టీష్’ అలాగే ‘పారడీ’ వంటి ప్రయోగాలు జరగ గా, తెలుగులో ‘సంస్కృత భరిత ‘భాష నుండి స్థానిక, వాడుక భాషలకు మార్పు జరిగింది. ఎ లా స్థానిక పలుకుబడులతో, సహజ యాసతో మాట్లాడతామో, అలాగే రాతలోనూ కనిపిస్తుంది. భావ వ్యక్తీకరణ సహజంగా పాత్రోచితంగా ఉం టుంది. గ్రాంథిక పద ప్రయోగాలు ఉండవు.
ఉదాహరణకు, అరుంధతీ రాయ్ రచించిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ మలయాళ పదాలను కలిపి, ఉపనివేశానంతర వ్యక్తిత్వం యొక్క హైబ్రిడిటీని (సంకరణం) ప్రతిబింబిస్తుంది. తెలుగు రచయిత చాగంటి సో మయాజులు (చాసో) తమ రచనలలో స్థానిక భాషను ఉపయోగించి, పీడిత వర్గాల వాస్తవాలను ప్రతిబింబించారు.

కథా నిర్మాణం
పోస్ట్ మోడర్నిజం, ముఖ్య లక్షణాలలో ఒకటైన ‘నాన్లీనియర్ ‘కథనం ఇరువైపు కనిపిస్తుంది. ఆంగ్ల రచయితలు సమకాలీన అనుభూతుల్ని ప్రతిబింబించేందుకు గందరగోళపు కథనాలను ఉపయోగిస్తే, తెలుగులో వ్యత్యా సం ఏమిటంటే అణచివేత, అలాగే ప్రతిఘటనల నడకను హైలైట్ చేయడానికి ఈ కథనాలు ఉపయోగించబడ్డాయి.
ఉదాహరణకు, పించన్ రచనలు కాలం, ప్రదేశం (ప్రాంతీయత)ల మధ్య అస్తవ్యస్తతను చూపిస్తే, వోల్గా రచనలు పురాణాలను, ఆధునిక సమస్యలతో మేళవించి సామాజిక అంశాలపై విమర్శలు చేస్తాయి.
సాంస్కృతిక ప్రత్యేకతలు
తెలుగు సాహిత్యంలో పోస్ట్ మోడర్నిజం, దాని చారిత్రక ప్రత్యేకతల ఆధారంగా వృద్ధి చెందింది. ఆంగ్ల సాహిత్యానికి పోలికగా, తెలుగు పోస్ట్ మోడర్నిజం, సామాజిక న్యాయం, ఉద్యమాలకు దారితీసింది.
పోస్ట్ మోడర్నిజం, ప్రభావం ఆంగ్ల, తెలుగు సాహిత్యాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, వాటి భిన్న భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాల ఆధారంగా ఈ ప్రభావం విభిన్నంగా వ్యక్తమైంది. ఈ ఆందోళన అంతర్జాతీయంగా ఎక్కడైనా వ్యక్తుల అనుభవాలను ప్రతిబింబించే సామర్థ్యాన్ని చూపిస్తుంది.
డా.కోలాహలం రామ్ కిశోర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News