Monday, December 23, 2024

ఐపిఒలకు వార్ సెగ

- Advertisement -
- Advertisement -
Impact of the Ukraine War on IPOs
ఈ నెలలో వచ్చే పబ్లిక్ ఆఫర్‌ల్లో డైలమా

న్యూఢిల్లీ : మార్చి నెలలో ఎల్‌ఐసి ఐపిఒతో పాటు మరిన్ని ఇష్యూలు క్యూలో ఉన్నాయి. అయితే ఉక్రెయిన్ష్య్రా యుద్ధం పరిస్థితులతో ఇప్పుడు ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) వస్తుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ మెగా ఐపిఒ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో అస్థిర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపిఒను తీసుకురావాలని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్‌లో ఐపిఒను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు 2022 మార్చి నాటికి ఎట్టి పరిస్థితిలో ఎల్‌ఐసి ఐపిఒను తీసుకురావాలన్నది ప్రభుత్వం లక్షంగా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్టా ఐపిఒని 2022 ఏప్రిల్‌కు మార్చేందుకు బ్యాంకర్లు, అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. వచ్చే వారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రష్యా -ఉక్రెయిన్ యుద్ధం దృష్టా ఎల్‌ఐసి ఐపిఒ లాంచ్‌ను వాయిదా వేసే అవకాశం ఉందని ముందుగానే సూచనలు ఇచ్చారు. ఇంకా పలు కంపెనీలు కూడా ఇప్పటికే సెబీకి ఐపిఒ పత్రాలను సమర్పించాయి. వాటికి ఆమోదం ఈ నెల రెండో వారంలో ఉండనుంది. వీటిలో బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ రూ.1,000 కోట్ల ఐపిఒ కోసం సెబీకి పత్రాలను సమర్పించింది.

ఈ సంస్థ 2,93,73,984 షేర్లను విక్రయించాలని యోచిస్తోంది. ఈ షేర్లను రతన్ అగర్వాల్, దీపక్ అగర్వాల్ అనే ఇద్దరు ప్రమోటర్లు విక్రయిస్తారు. ఇక ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఫెడ్‌ఫినా) ఐపిఒ త్వరలో పెట్టుబడి కోసం రానుంది. ఈ కంపెనీ కూడా సెబీకి పత్రాలను సమర్పించింది. మరో సంస్థ ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ రూ.2,200 కోట్ల విలువైన ఐపిఒ పత్రాలను దాఖలు చేసింది. ఈ ఆర్కియన్ ప్రత్యేకమైన సముద్ర రసాయనాల తయారీ సంస్థ, ఇష్యూ ద్వారా రూ.1,000 కోట్ల విలువైన కొత్త షేర్లు జారీ చేస్తోంది. అంతేకాకుండా మెక్‌లియోడ్ ఫార్మాస్యూటికల్స్, టివిఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్, హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కూడా సెబీకి పత్రాలను సమర్పించాయి. ఇంకా ఐపిఒ జాబితాలో ఉన్న సంస్థలు కిడ్స్ క్లినిక్ ఇండియా లిమిటెడ్, -కోజెంట్ ఇ-సర్వీసెస్ లిమిటెడ్, -ఇనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, -ఎథోస్ లిమిటెడ్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News