Sunday, January 19, 2025

గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు.. ఇంఫాల్ విమానాశ్రయం మూసివేత

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : గగనతలంలో గుర్తు తెలియని డ్రోన్లు కనిపించడంతో ఇంఫాల్ లోని బిర్ టికేంద్రజిత్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో విమానాశ్రయం గగనతలంలో డ్రోన్లు ఎగురుతుండడాన్ని గమనించారు. దీంతో వెంటనే విమానాశ్రయాన్ని మూసివేయాలని ఆదేశించారు. ఈ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. అక్కడికి చేరవలసిన విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News