Wednesday, January 22, 2025

త్వరలో ఉమ్మడిసివిల్ కోడ్ అమలు : ఉత్తరాఖండ్ సిఎం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో త్వరలో ఉమ్మడిసివిల్ కోడ్ అమలు చేయడానికి పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మంగళవారం వెల్లడించారు. ప్రధాని మోడీతో ఆయన మంగళవారం భేటీ అయ్యారు. దీనిపై చర్చ జరిగిందనడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌ను సందర్శించాలని ప్రధాని మోడీని ఆహ్వానించినట్టు చెప్పారు.

జోషిమఠ్, ఛార్‌ధామ్ యాత్ర, బాధితులకు సహాయం అందించే విషయం చర్చించినట్టు చెప్పారు. అలాగే రాష్ట్రం లోని జిఎస్‌టి వసూళ్లు, ఇతర ముఖ్యమైన అంశాలు ప్రస్తావించామని చెప్పారు. ఉమ్మడి సివిల్ కోడ్ కూడా చర్చించాల్సిన అంశమే కదా అని ప్రశ్నించగా, నేరుగా సమాధానం ఇవ్వకుండా ముఖ్యమంత్రి తప్పించుకున్నారు. ఉమ్మడిసివిల్ కోడ్ ప్రయోజనాల గురించి ఆయనకు తెలుసని దేశం మొత్తం మీద తప్పనిసరిగా అమలు చేయాలన్నది ప్రధాని ఆలోచన అని సిఎం పేర్కొన్నారు. యుసిసి ప్రతి రాష్ట్రానికి అందగానే తాము ఎలాంటి ఆలస్యం చేయబోమని , అలాగని తొందర పడబోమని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News