Monday, January 6, 2025

ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో అమలు చేయడానికి ప్రతిపాదించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా పూర్తయిందని, త్వరలోనే దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని దీనికోసం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ శుక్రవారం ఇక్కడ చెప్పారు. ఉమ్మడి పౌరసృమతికి సంబంధించి ముసాయిదాను రూపొందించడానికి ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వం గత ఏడాది రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసింది. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు వివిధ శాసనాలు, కోడిఫై చేయని చేయని చట్టాలను పరిశీలించిన అనంతరం ఈ కోడ్ ముసాయిదాను రూపొందించడం జరిగిందని దేశాయ్ చెప్పారు.

అంతేకాకుండా ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో పాటిస్తున్న సంప్రదాయాలను కూడా అర్థం చేసుకోవడానికి తమ కమిటీ ప్రయత్నించిందని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ కోసం ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదాను రూపొందించడం పూర్తయిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కోడ్ ముసాయిదాతో పాటుగా కమిటీ నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం’ అని దేశాయ్ తెలిపారు. కాగా ఉమ్మడి పౌరస్మృతి కోడ్ ముసాయిదా లేదా నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలను వెల్లడించడానికి దేశాయ్ నిరాకరిస్తూ దీన్ని ముందుగా రాష్ట్రప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News