Saturday, December 21, 2024

రైతుల రుణమాఫీ అమలును వేగవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ

మన తెలంగాణ / హైదరాబాద్ : రైతు రుణమాఫీ అమలును వేగవంతం చేయాలని సిపిఐ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ ఒక ప్రకటనలో అన్నారు. రుణమాఫీ అమలులో జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆందోళనకు గురిఅవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన గడువు సెప్టెంబర్ 15తో ముగియడంతో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారని, సాంకేతిక కారణాలు వల్ల రుణమాఫీ చేయడానికి ఇబ్బంది ఎదురవుతుందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. రుణమాఫీ మొత్తంగా 42 లక్షల 21 వేల 389 మందికి (ప్రభుత్వం గుర్తించి వారికి ) చేయాలంటే 20 వేల 488 కోట్లు అవసరం అవుతాయని ఆమె అన్నారు.

ప్రభుత్వం కేవలం 12 వేల కోట్లు విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతోందని, దీనిపై వాస్తవాలు వెల్లడించాలన్నారు. అలాగే రైతుల రుణమాఫీకి అవసరమైన మొత్తం డబ్బును బ్యాంకుల్లో జమ చేసి దాని అమలును వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం విజ్ఞప్తి చేస్తోందన్నారు. 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు నాటి నుండి నేటి వరకు పంట రుణాల పైన వడ్డీ బాధ్యతలను కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఒకేసారి రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు అనేకమంది రెన్యువల్ చేసుకోకుండా ఉండటంతో వడ్డీ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వడ్డీ భారాన్ని రైతులపై మోపకుండా ప్రభుత్వమే బాధ్యత వహించేలా బాధ్యతలను తీసుకోవాలని పశ్య పద్మ విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కారణాలను తొలగించడానికి వెంటనే చర్యలు తీసుకొని రైతుల రుణమాఫీని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్య పద్మ డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News