Friday, December 27, 2024

జిల్లాలో పోలీస్ 30 యాక్టు అమలు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో పోలీస్ 30యాక్టు అమలులో ఉంటుందని జిల్లా ఎస్‌పి రమణకుమార్ అన్నారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు సభలు నిర్వహించరాదన్నారు. ప్రజా ధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులకు సహకరించాలని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News