Sunday, December 22, 2024

పోలీస్ యాక్టు అమలు

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత

సిద్దిపేట: సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో 22(1) ఏ నుండి ఎఫ్, 22(2) ఏ అండ్ బి, 22(3) యాక్టు ప్రకారం నేటి నుంచి 20 వరకు సిటీ పోలీసు యాక్టు అమలులో ఉంటుందని పోలీసు కమిషనర్ శ్వేత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా ఈ కార్యక్రమాలు చేపడితే ముందస్తుగా పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలను, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

అనుమతి లేకుండా ఫారాగ్లెడర్ మరియు రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్స్ రిమోట్ కంట్రోల్డ్ మైక్రోలైట్స్ ఎయిర్ క్రాప్ట్ మొదలైన వాటి వాడకంపై నిషేధం శాంతి భద్రతల పరిరక్షణ చర్యలకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. చిన్నపిల్లలు, వృద్దులు, రోగులు, విద్యార్థుల విబ్యాసానికి భంగం కలగకుండా శబ్ధ కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధం అన్నారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపితస్తే సంబంధిత డివిజన్ ఎసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించారు. పై నిబంధనలు ఉల్లంఘించిన డిజె వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News