Monday, January 20, 2025

దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు

- Advertisement -
- Advertisement -
  • రాఘవాపూర్‌లో నాబార్డ్ నిధులతో నిర్మించిన
    వెయ్యి మెట్రిక్ టన్నుల నూతన గోడౌంను
    ప్రారంభించిన చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి

పరిగి: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతులకు సంక్షేమ పథకాలను కేసిఆర్ ప్రభుత్వం అందిస్తుందని చెవెళ్ల ఎంపి డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామ పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నాబార్డు నిధులతో నూతనంగా నిర్మించిన వెయ్యి మెట్రిక్ టన్నుల ధాన్యం సామర్థం కలిగిన గోడౌంను స్థానిక పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ నా బార్డ్డు వారి ఎంఎస్సీ స్కీమ్ నిధులు సుమారు రూ. 63.48 లక్ష లు, హైదరాబాద్ డిసిసిబి, టి స్కాబ్ వారి 20 శాతం వాటాతో ఈ గోదాంను నిర్మించడం సంతోషకరమన్నారు. ఈ గోడౌం చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి రూ. 22 లక్షలు, సిసి వేసేందుకు రూ. 10 లక్షలు ఖర్చు చేసి మొత్తం 95.48 లక్షల ఆర్థిక సహాయంతో విశాలంగా ధాన్యం నిల్వ చేసే గోదాం నిర్మించారని అన్నారు.

గ్రామీణ ప్రాంత రైతులు పండించిన ధాన్యం బస్తాలను నిల్వ చేసుకునేందుకు ఈ గోడౌంలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కేసిఆర్ ప్రభు త్వం వచ్చిన తర్వాత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి గిట్టుబాటు ధరను కల్పించి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. రైతు సంక్షేమమే ధ్యే యంగా కేసిఆర్ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని తెలిపారు. రైతుల సంక్షే మం కోసం అనేక పథకాలను తీసుకవచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని అన్నారు.

రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు సంక్షేమ ఫథకా లు తెలంగాణలో అమలు అవుతున్నాయని అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నామని, తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఈ గోడౌంను నిర్మించిన సొసైటీ డైరెక్టర్లు ఎస్.భాస్కర్, పెదమూల హన్మంత్‌రెడ్డి, సర్పంచ్ నల్క జగన్‌లను అభినందించిన ఎంపి, ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్, పిఏసిఎస్ ఛైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ శివనోల్ల భాస్కర్, ఎంపిపి కరణం అరవింద్‌రావు, జడ్‌పిటిసి హరిప్రియా ప్రవీణ్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్ సురేందర్, సొసైటీ డైరెక్టర్‌లు పి.హన్మంత్‌రెడ్డి, భోజ్యానాయక్, రాంరెడ్డి, నా ర్మాక్స్ డైరెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, ఎంపిటిసి వెంకట్రామ్‌రెడ్డి, సిఈఓలు అమర్‌నాథ్‌రెడ్డి, దోమ యాదిగిరి, మమత, నాయకులు గోపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, ఆంజనేయులు, మౌలానా, రవి, యాదగిరి, సత్యనారాయణ, షోయాబ్, మైపాల్, నాగేష్, విజయ్, సిద్దీక్ వార్డు సభ్యులు యాదగిరి, ఆంజనేయులు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News