Thursday, January 23, 2025

ప్రజాస్వామ్యానికి పెద్ద పీట

- Advertisement -
- Advertisement -
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/ కామారెడ్డి ప్రతినిధి/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రానున్నదని తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేస్తుందని టిపిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశా రు. తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానానికి నేటి ఎన్నికల ఫలితాలకు సంబంధం ఉందన్నారు. ఆయన డిసెంబర్ 3న ఆత్మబలిదానానికి ప్రయత్నించి డిసెంబర్ 9న శ్వాస విడిచారని తెలిపారు. అదే విధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న రానున్నాయని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు ఆయన తెలిపారు.

గెలిచినవాడు రాజు కారని, ఓడినవారు బానిసకారని గెలిచినవారు ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేసేవారని, ఓటమిపాలైనవారు ప్రతిపక్షంలో ప్రజల కోసం పాటుపడేవారని  పాలకపక్షం, ప్రతిపక్షం బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బతికిబట్టకడుతుందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కేవలం 25స్థానాలకే పరితమవుతుందని జోస్యం చెప్పారని అన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు కుల, మతాలకు అతీతంగా ప్రజారంజక పాలన అందిస్తామని రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మాజి అరికెల నర్సారెడ్డి, ఉమ్మడి జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కుటు ంబసభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం కొడంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ 85మంది ఎంఎల్‌ఎలు గెలిస్తే అందులో ప్రతి ఒక్కరూ సిఎం పదవికి సమర్థులేనని అన్నారు.

ముఖ్యమంత్రి ఎంపికకు ఓ పద్ధతి, విధానం ఉంటుందన్నారు. క్రికెట్ టీమ్ సెలక్షన్ కమిటీ ప్రకటిస్తుందని, వీరిలో ఒకరు కెప్టెన్ అవుతారని రేవంత్ అన్నారు. అలాగే ఎమ్మెల్యేలంతా కలిసి చర్చించి సిఎంను ఎన్నుకుంటారన్నారు. క్రికెట్‌లో కెప్టెన్ ఎంపిక సమయంలో బిసిసిఐ కీలక పాత్ర పోషించినట్లు ఇక్కడ కూడా అధిష్టానం ఉంటుందని ఆయన గుర్తు చేశా రు. అప్పుడే సిఎం పదవిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల తర్వాత సిఎం ఎవరన్నది అందరికీ తెలుస్తుందని, డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుందని గుర్తు చేశారు. నాగార్జున సాగర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులపై రేవం త్ స్పందించారు. తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్నవారన్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రభు త్వం రావాలన్నారు. రాబోయే ప్రభుత్వం నీటి సమస్యలపై సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News