Sunday, January 19, 2025

గ్రూప్ 1 హాల్ టికెట్లపై తప్పనసరిగా మూడు నెలల్లో దిగిన ఫొటోను అతికించాలి

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్‌పై మూడు నెలల క్రితం దిగిన పాస్‌పోర్టు సైజ్ ఫొటోను తప్పనిసరిగా అతికించాలని టిజిపిఎస్‌సి తెలిపింది. ఈ నిబంధనను హాల్ టికెట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది. ఫొటో కింద సంతకం చేసేందుకు తప్పనిసరిగా స్పేస్ ఉంచుకోవాలని కమిషన్ సూచించింది. హాల్ టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ కార్డును పరీక్షా కేంద్రం వద్ద చూపిస్తేనే లోపలికి అనుమతిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News