Monday, December 23, 2024

ప్రయాణికులకు ముఖ్య గమనిక!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయని టిఎస్ఆర్ టిసి ఎండి, విసి సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను టిఎస్ఆర్ టిసి రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోంది. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్ లోని ఎంజిబిఎస్ నుంచి బయలుదేరుతాయి. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరు. మరింత సమాచారం కోసం టిఎస్ఆర్టిసి కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరన్నారు.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News