Saturday, February 22, 2025

రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలను విధించండి : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

Impose more stringent sanctions on Russia: President Zelensky

కీవ్ : రష్యాపై మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. జపొరిజ్జియా అణువిద్యుత్తు కర్మాగారంపై రష్యా బాంబు దాడుల నేపథ్యంలో ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిడలతో ఫోన్ ద్వారా మాట్లాడారు. జెలెన్‌స్కీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో జపాన్ ప్రధాన మంత్రి పుమియో కిషిడతో మాట్లాడానని చెప్పారు. జపొరిజ్జియా న్యూక్లియర్ పవర్ ప్లాంటుపై రష్యా అణు ఉగ్రవాదం గురించి వివరించినట్టు తెలిపారు. ప్రపంచ భద్రతకు ఎదురయ్యే ముప్పు తీవ్రంగా ఉందని ఇరువురు అంగీకరించామన్నారు. ఉక్రెయిన్‌కు అనేక రకాలుగా సాయపడుతున్నందుకు, రష్యాపై ఆంక్షలను కఠినతరం చేయాలని పట్టుబడుతున్నందుకు జపాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. దురాక్రమణదారుడిని తామిద్దరం కలిసి వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఉక్రెయిన్‌కు భద్రతాపరమైన హామీలు లభించే విధంగా టర్కిష్ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సాయపడతారని జెలెన్‌స్కీ చెప్పారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ లోని వోల్నోవాఖా వద్ద శుక్రవారం ఓ రష్యన్ ఎస్‌యు25 విమానాన్ని కూల్చివేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ విమానం నివాస గృహాల పైనా , ప్రజల మౌలిక సదుపాయాల పైనా దాడులు చేసిందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News