Saturday, November 23, 2024

ఇండియాపై ఆంక్షలు విధించండి!

- Advertisement -
- Advertisement -
Christian Michel
ఇంగ్లాండ్‌ను కోరిన క్రిస్టియన్ మైఖేల్

న్యూఢిల్లీ: రూ. 3600 కోట్ల వివిఐపి (ఆగస్టావెస్ట్‌లాండ్) హెలికాప్టర్ల కుంభకోణంలో దళారిగా ఆరోపితుడైన క్రిస్టియన్ మైఖేల్ ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లేఖ రాశాడు. మాగ్నిట్కీ చట్టం(మానవ హక్కులను ఉల్లంఘించినందుకు విధించే ఆంక్షలు) అమలుచేయకపోతే నవంబర్ 25 నుంచి నిరాహారదీక్ష మొదలెడతానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ప్రస్తుతం మైఖేల్ తీహార్ జైలులో ఉన్నాడు. అతడు జైలు నుంచే 2021 అక్టోబర్ 5న ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఈ లేఖ రాశాడు. తన డిమాండ్లను ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆమోదించకపోతే నవంబర్ 25 నుంచి నిరాహారదీక్ష చేపడతానని అతడు ఆ లేఖలో హెచ్చరించాడు.

అమెరికాలో రిజిష్టరయిన ఓడ నోస్ట్రోమోపై దాడి, అరబ్ ఎమిరేట్స్ ప్రధాని షేఖ్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూతురు యువరాణి లతిఫాను అపహరించిన వ్యవహారంలో హస్తమున్న సంస్థలు, వ్యక్తులపై ఆ చట్టాన్ని ప్రయోగించాలని అతడు డిమాండ్ చేశాడు.
“నోస్ట్రోమో ఓడపై దాడి ఓ ‘కుంభకోణం’. ఆ ఓడపై దాడిచేసిన వారు బాగా తెలిసినవారే. వారి పేర్లను ఇంగ్లాండ్ కోర్టు కూడా పేర్కొంది. కుంభకోణంలోనే మరో కుంభకోణం ఉంది. యువరాణి లతిఫాకు, నోస్ట్రోమో ప్రయాణికులకు, సిబ్బందికి ఏమి జరిగింది?… ఏదిఏమైనా ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలుచేపట్టడం లేదు. రష్యా, చైనా, సౌదీ వక్తులపై ఆంక్షలు విధించమన్నది వివరించలేనిది” అంటూ అతడు తన లేఖలో పేర్కొన్నాడు.

అనేక విచారణల అనంతరం మైఖేల్ బెయిల్ నిరాకరించబడింది. బ్రిటిష్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానంపై ఒకవేళ ప్రభుత్వం చర్య చేపట్టకపోతే, మానవ హక్కులను ఉల్లంఘించిన వారు భారతీయులైనా లేక ఇతర మిత్రదేశాలకు చెందినవారైనా వారిపై ఆంక్షలు అమలుచేయకపోతే తనకు నిరాహారదీక్ష తప్ప వేరే గత్యంతరం లేదని అతడు పేర్కొన్నాడు.
బ్రిటిష్ మీడియా కథనం ప్రకారం భారత్ కనుక సహకరిస్తే మైఖేల్‌ను అప్పగిస్తానని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒప్పుకుంది. దాంతో అరబ్ ఎమిరేట్స్ నుంచి పారిపోతున్న యువరాణి లతిఫా ఉన్న ఆ ఓడపై తీరగస్తీ దళం దాడిచేసిందని, భారతీయ కమాండోలు లతిఫాను బలవంతంగా అరబ్ ఎమిరేట్స్‌కు తిప్పి పంపారని స్వయంగా ఆమెనే పేర్కొందని తెలుస్తోంది. అయితే నీకిది నాకది(క్విడ్ ప్రో క్వో) రిపోర్టులను ఇంగ్లాండ్ ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News