నాంపల్లి: చిన్నారుల ఆటపాటలతో కళావేదిక హోరెత్తింది. భిన్నత్వ సమాహారంలో ఏకత్వ దిశగా పిల్లలు మధురంగా, శ్రావ్యంగా ఆలపించిన గీతాలు, నృత్యాలు పరిమళించాయి. ఆదివారం నాంపల్లి తెలుగువిశ్వవిద్యాలయ ఆడిటోరియం వేదికగా విజయమాధవి సేవా సాంస్కృతిక అకాడమీ పక్షాన భారత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ భావ స్ఫూర్తిని పెంచే దిశగా కళాంశాల ప్రదర్శనలు అంబరాన్ని తాకాయి. ఉత్సాహపూరిత వాతావరణం నడుమ పిల్లలు అద్భుత శైలిలో తమ స్వర విన్యాసాలతో ఆద్యంతం సభీకులను ఆలరించారు. దేశభక్తి గీతాలను శ్రావ్యంగా పాడిన తీరు ప్రత్యేక ఆకర్షణ… విభిన్నరకాల నృత్యాలతో ఆధరహో అనిపించారు.
పల్లె సంస్కృతి, వైభవాన్ని ప్రతిబింబించేలా విభిన్నరకాల డ్యాన్సుల ఆవిష్కరణలతో ఆహుతులను మంత్రముగ్దుల్ని చేశారు. తెలంగాణ భక్తి సాంస్కృతికి, జనజీవన సంస్కృతికి ప్రతిబింబించేలా చిన్నారుల బోనాల ఉత్సవాల్లో కీలక ఘట్టాలను కనూల పం డువగా అద్భుతంగా ప్రదర్శించి ఔరా అనిపించారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా పిల్లలు తమ ఆటపాటలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ రాధామోహన్ విచ్చేశారు. విజయమాధవి సేవా సాంస్కృతిక అ కాడమీ వ్యవస్ధాపకులు విజయమాధవి కిషోర్ ఆధ్వర్యంలో సాంస్కృతికోత్సవాలను పర్యవేక్షించారు. తొలుత జ్యోతిప్రజ్వనలతో ఉత్సవాలు శ్రీకారం జరిగా యి. డ్యాన్స్‌లు ప్రదర్శించిన చిన్నారులకు జ్ఞాపికలు అందించి అభినందించారు.