Sunday, December 22, 2024

ఆకట్టుకుంటున్న మోడల్ పోలింగ్ స్టేషన్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో విభిన్న రీతుల్లో థిమాటిక్‌గా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ జిల్లాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల పరిధిలో మొత్తం వివిధ కేటగిరీల వారిగా 180 థిమాటిక్ (మోడల్) పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.  ఇందులో నియోజకవర్గానికి 5 చొప్పున 75 మహిళా పోలింగ్ కేంద్రాలు, నియోజకవర్గానికి 5 చొప్పున మరో 75 మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు పి.డబ్లు.డి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు, యూత్ కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 15 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళా పోలింగ్ స్టేషన్ లో కేవలం మహిళలు, యూత్, పిడబ్ల్యుడి పోలింగ్ స్టేషన్ లో పిడబ్ల్యుడి యూత్ సిబ్బంది మాత్రమే ఎన్నికల విధులు నిర్వహించనున్నారని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్ రోస్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News