మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిని శనివారం బిఆర్‌కె భవన్‌లో సిఎస్ సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ వెంటనే భర్తీచేయాలని అన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటుచేయడం, అదనపు అంతస్తుల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని బోధన ఆసుపత్రుల్లో పిడియాట్రిక్ ఆక్సిజన్, ఐసియు పడకలను పెంచాలని అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని, వాక్సినేషన్ కోసం మిగిలిన వారందరికీ గుర్తించేందుకు ప్రత్యేక మాప్ అప్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్ రెడ్డి, టిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖరరెడ్డి, టిఎస్‌ఐఐసి చీఫ్ ఇంజనర్ శ్యామ్‌సుందర్, టిఎస్‌ఎంఐడిసి సిఇ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి: సిఎస్
- Advertisement -
- Advertisement -
- Advertisement -