Sunday, December 22, 2024

ఇమ్రాన్‌దే పైచేయి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్/లాహోర్ : పార్లమెంట్ ఎన్నికల అనంతరం విభజిత ప్రజాతీర్పుతో పాకిస్థాన్‌లో రాజకీయ పరిస్థితి అనిశ్చితికి దారితీసింది. అధికార స్థాపనకు అవసరమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యం అయింది. ఈ దిశలో ప్రధానమైన మూడు రా జకీయ పార్టీలు తమ సర్దుబాట్ల యత్నాలను మరింత ము మ్మరం చేశాయి. ఎప్పుడు సైనిక తిరుగుబాట్లు తలెత్తుతా యో తెలియని దేశంలో ఇప్పుడు నెలకొన్న హంగ్ పార్లమెం ట్ గందరగోళానికి దారితీసింది. మొత్తం మీద ఈ ఎన్నికల ఫలితాలు జైలులో మగ్గుతోన్న దేశ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు ఉపశమనం కల్గించాయి. గురువారం దే శంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఫలితాలు మిశ్రమరీతిలో నిలిచాయి. పలు పార్టీలు ఫలితాల రిగ్గింగ్ జరిగిందని ఆరోపించాయి. అనేక చోట్ల నిరసనలు, కొన్ని చోట్ల విధ్వంసకాండల పరిస్థితి నెలకొంది.
సైన్యం మద్దతు నవాజ్ షరీఫ్ పార్టీకే
సరైన మెజార్టీ రానప్పటికీ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్) పా ర్టీకి దేశంలోని అత్యంత శక్తివంతం, అధికార నిర్ధేశితం అ యిన సైన్యం మద్దతు దక్కింది. దేశ సైనిక ప్రధానాధికారి జనరల్ అసిమ్ మునీర్ శనివారం పరోక్షంగా షరీఫ్ సార ధ్య ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. దేశం ఇప్పుడు పూర్తి గా క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ఈ దశలో ఐక్య ప్రభుత్వం ఏర్పాటు అత్యవసరం అని పిలుపు నిచ్చారు. ఇప్పుడు పార్లమెంట్‌లోని మొత్తం 266 స్థానాలలో 265 సీట్లకు ఎన్నికలు జరిగాయి. కాగా ఎన్నికల సంఘం ఇప్పటికీ 264 స్థానాల ఫలితాలు వెలువరించింది. మరొక్క స్థానానికి ఫలితాన్ని అక్రమాల ఫిర్యాదులతో నిలిపివేశారు. మరో స్థానానికి పోలింగ్ అభ్యర్థి మరణంతో వాయిదా వేశారు.
లెక్కల ప్రకారం చూస్తే ఇమ్రాన్‌కు ఆధిక్యత
ఈసారి జరిగిన ఎన్నికలలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతు ఉన్న ఇండిపెండెంట్లు 101 స్థానాలలో గెలిచారు. అయితే అత్యధిక స్థానాలు అంటే 75 గెల్చుకున్న నవాజ్‌షరీఫ్ పార్టీ ఏకై క అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఇది సాంకేతికంగా చూస్తే ప్రభుత్వ స్థాపనకు ఈ పార్టీ అధికారానికి మార్గం చేసేలా ఉంది. కాగా బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) సొంతంగా 54 స్థానాలను గెల్చుకుం ది. అధికార స్థాపనలో చక్రం తిప్పే దశలో ఉంది. ఎంక్యూఎంపికి 17, ఇతరులకు 12 సీట్లు వచ్చాయి. జాతీయ అ సెంబ్లీలో అధికార స్థాపనకు అవసరం అయిన గీటురాయి బలం 133. ఈ కోణంలో చూస్తే మాజీప్రధాని షరీఫ్, పిపిపి కలిసి ముందుకు వస్తే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు వీలేర్పడుతుంది. దీనితో ఈ రెండు పార్టీల అగ్రనేతల నడుమ సంప్రదింపులు జోరందుకున్నాయి. పిఎంఎల్‌ఎన్ ఇప్పుడు పెద్ద ఎత్తున సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతోంది. ఇందుకు అవసరం అయిన అన్ని హంగులు సంతరించుకుని ఉంది.
పిడిఎం 2.0కు రంగం సిద్ధం
దేశం చిక్కుల్లో ఉన్న తరుణంలో తమ సంకీర్ణం తప్పనిసరి అని నవాజ్ షరీఫ్ చెపుతున్నారు. భుట్టో పార్టీ వైఖరిని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. నవాజ్ షరీఫ్ సోదరుడు మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను తెరవెనుక సంప్రదింపులకు రంగంలోకి దిగారు. ఆదివారం పిఎంఎల్ ఎన్ నేతలు ఎంక్యూఎంపి నేతలతో లాహోర్‌లో జరిపిన చర్చలు ఫ లించాయి. తాము సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా గత రెండురోజులుగా షెహబాజ్ షరీఫ్ పిపిపి నేతలు ఆసిఫ్ అలీ జర్దారీ, బిలావల్‌లతో చర్చలు జరిపారు. బిలావల్‌కు ప్రధాని పదవి ఇవ్వాలని పిపిపి డిమాండ్ చేస్తోంది. కీలక పదవులు కోరుతోంది. ఇది కుదరదని నవాజ్ షరీఫ్ పార్టీ స్పష్టం చేస్తోంది. దేశం లో ఇమ్రాన్‌ఖాన్ సారధ్యపు ప్రభుత్వం కూలిన తరువాత ఏర్పాటు అయిన పాకిస్థాన్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్ కొ యలిషన్(పిడిఎం) ఇప్పుడు సరికొత్తరూపంలో తిరిగి పగ్గా లు చేపట్టేందుకు మార్గం ఉంది. దీనిని పిడిఎం 2.0గా వ్యవహరిస్తారు. ఇండిపెండెంట్లుగా పోటీచేసిన పిటిఐ అభ్యర్థు లు ఇప్పుడు తమ భవితవ్యంపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా రు. దేశంలో మాజీ ప్రధాని పార్టీ ఆధ్వర్యంలో మరోసారి సంకీర్ణ ఏర్పాటు సిగ్గు చేటని ఇమ్రాన్ పార్టీ విమర్శించింది. సంకీర్ణ ప్రభుత్వ అసమర్థతతో దేశం దివాళా తీసిందని మండిపడుతున్నారు. తమకే అత్యధిక సంఖ్యలో స్థానాలు వచ్చినందున తమ పార్టీని అధికార స్థాపనకు ఆహ్వానించాలని పిటిఐ కోరుతోంది. ఇదే కనీస రాజ్యాంగ, ప్రజాస్వామిక, రాజకీయ హక్కుల పరిరక్షణ అవుతుందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News