Wednesday, January 22, 2025

ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ.. తోషఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

ఒకప్పటి ప్రముఖ క్రికెటర్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే జైలులో ఉన్న ఇమ్రాన్ ను పాకిస్తాన్ కోర్టు సైఫర్ కేసులో దోషిగా నిర్ధారించి, పదేళ్ల జైలు శిక్ష విధించి ఒక రోజైన కాకముందే మరో కేసులో 14 ఏళ్ల శిక్ష పడింది. తోషఖానా కేసులో ఇమ్రాన్ కు, ఆయన భార్య బుష్రా బీబీకి న్యాయస్థానం 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు పాకిస్తాన్ మీడియా పేర్కొంది. ఈ కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.

ఇమ్రాన్ తాను ప్రధానిగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి వచ్చిన బహుమతులను అమ్మి సొమ్ము చేసుకున్నారని కేసు దాఖలైంది. దీనినే తోషఖానా కేసుగా వ్యవహరిస్తున్నారు.

సైఫర్ కేసులోనూ, తోషఖానా కేసులోనూ ఇమ్రాన్ కు విధించిన శిక్షలు ఏకకాలంలో అమలవుతాయా లేక విడివిడిగా అమలవుతాయా అన్నది తెలియరాలేదు. ఇమ్రాన్, బుష్రా 2018లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలల్లో ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇమ్రాన్ రెండు కీలకమైన కేసుల్లో దోషిగా నిర్థారించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News