Saturday, December 28, 2024

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్, సోదరి యుజ్మాఖాన్‌కు సమన్లు

- Advertisement -
- Advertisement -

లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు, ఆయన సోదరి యుజ్మాఖాన్‌కు భూమి కొనుగోలు స్కామ్‌కు సంబంధించి అవినీతి నిరోధక శాఖ సమన్లు జారీ చేసింది. మోసంతో చాలా తక్కువ ధరకు 625 ఎకరాలు కొనుగోలు చేయడంపై పంజాబ్ అవినీతి నిరోధక విభాగం సమన్లు జారీ చేసింది. యుజ్మాఖాన్ భర్తకు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఈనెల 19 (సోమవారం) న ఇమ్రాన్, ఆయన సోదరి యుజ్మాఖాన్, ఆమె భర్త ఎసిఇ డిజి ఖాన్ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. అంతకు ముందు జూన్ 16న హాజరు కావాలని సమన్లు జారీ కాగా, ఇమ్రాన్ హాజరు కాలేదు. లాహోర్ లోని ఖాన్‌కు చెందిన జమన్ పార్క్ నివాసానికి సమన్లు అతికించినట్టు ఎసిఇ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News