- Advertisement -
కోర్టు ధిక్కార చర్యలు వాయిదా వేసిన పాక్ హైకోర్టు
ఇస్లామాబాద్: ఒక మహిళా న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పేందుకు తాను సిద్ధమని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం ఇస్లామాబాద్ హైకోర్టులో తెలియచేయడంతో ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కార నేరారోపణ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. గత నెలలో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ అదనపై జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి జేబా చౌదరిపై ఇమ్రాన్ ఖాన్ వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దాఖలైన కేసులో ఆయనపై హైకోర్టు విచారణ చేపట్టింది. గురువారం కోర్టులో హాజరైన ఇమ్రాన్ ఖాన్ తన వ్యాఖ్యలపై మహిళా న్యాయమూర్తి జేబా చౌదరికి క్షమాపణలు చెప్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో చీఫ్ జస్టిస్ అథర్ మినాల్లా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.
- Advertisement -