Sunday, December 22, 2024

శిక్షకు వ్యతిరేకంగా ఇమ్రాన్‌ఖాన్ అపీలు పై 22న విచారణ

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : తోషాఖానా కేసులో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఈనెల 5న మూడేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన అపీలుపై ఇస్లామాబాద్ హైకోర్టు ఈ నెల 22న విచారణ చేపట్టనుంది. ఈమేరకు చీఫ్ జస్టిస్ అమెర్ ఫరూక్, జస్టిస్ మెహమూద్ జహంగిరిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తుందని కోర్టు బుధవారం వెల్లడించింది. ఎలెక్షన్ కమిషన్ పాకిస్థాన్ (ఇసిపి)న్యాయవాది కోర్టులో వినిపించిన చివరి వాదనలను తమ న్యాయవాది తిప్పి కొట్టలేక పోయారని అందువల్ల ఈ విచారణను మరో కోర్టుకు బదిలీ చేయాలని ఇమ్రాన్ ఖాన్ తన అపీలులో పేర్కొన్నారు. అంతేకాక ముందుగా అనుకున్న పథకం ప్రకారం శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్టు ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News