Monday, January 20, 2025

పలు కేసుల్లో జూన్ 8 వరకు ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్!

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని పలు కేసుల్లో బెయిల్ పొందారు. ఆయనకు ఇస్లామాబాద్‌లోని యాంటీటెర్రరిస్ట్ కోర్టు పలు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. శక్తిమంతమైన మిలిటరీ, ప్రభుత్వం నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు ఈ బెయిల్‌తో కాస్త ప్రశాంతత దక్కింది. ఆయన టెన్షన్‌ల నుంచి కాస్త ఊరట పొందారు. ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించినట్లు ఆయన లాయర్ ముహమ్మద్ అలీ బొఖారి మంగళవారం ఫోన్ ద్వారా తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ మంగళవారం తర్వాత తనపై అవినీతి ఆరోపణను విచారిస్తున్న ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ ముందు హాజరు కావాల్సి ఉంది. ప్రతిపక్ష నాయకుడు విచారణకు ముందే మళ్లీ తనని అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తనను కస్టడీలోకి తీసుకున్నా శాంతియుతంగా ఉండాలని ఆయన తన మద్దతుదారులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News