- Advertisement -
ఇస్లామాబాద్: పదవీచ్యుతుడైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం కొనసాగుతున్న షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తాజా ఎన్నికల ప్రకటన చేయడానికి ఆరు రోజుల గడువు పెట్టారు. ప్రాంతీయ అసెంబ్లీలను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ‘దిగుమతిచేయబడిన ప్రభుత్వం’ గనుక అలా చేయని పక్షంలో తాను మొత్తం జాతిని తీసుకుని రాజధానికి వస్తానని హెచ్చరించారు. గురువారం జిన్నా ఎవెన్యూలో ‘ఆజాదీ మార్చ్’ అనే వేలాది నిరసనకారులతో నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
- Advertisement -