Wednesday, April 2, 2025

నోబెల్ శాంతి బహుమతి రేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన కృషికి గాను ఆయనకు ఈ నామినేషన్ లభించింది. నార్వే లోని రాజకీయ పార్టీ “ పార్టియెట్ సెంట్రం ”సభ్యులు , పాకిస్థాన్ వరల్డ్ అలయన్స్ అనే సంస్థతో కలిసి ఈ నామినేషన్ దాఖలు చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం గర్వంగా ఉందని పార్టియెట్ సెంట్రం ఒక ప్రకటనలో తెలియజేసింది. 2019 లో కూడా నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్‌ను నామినేట్ చేశారు. దక్షిణాసియాలో శాంతిని ప్రోత్సహించేందుకుఆయన చేసిన కృషికి ఈ అవకాశం లభించింది. ప్రతి సంవత్సరం నార్వే కమిటీ వందలాది నామినేషన్లను అందుకుంటుంది. ఆ తర్వాత ఎనిమిది నెలల పాటు జరిగిన ఎంపిక ప్రక్రియలో విజేతను నిర్ణయిస్తారు. ఇమ్రాన్ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అధికార దుర్వినియోగం, అవినీతికి సంబంధించి ఆయనకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News