Wednesday, January 22, 2025

ఇమ్రాన్ ఖాన్ కు పదేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఇమ్రాన్ తోపాటు ఈ కేసులో పిటిఐ ఉపాధ్యక్షుడు, మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీకి కూడా పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ అధికారిక రహస్యాల చట్టం ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికలు జరగడానికి వారం రోజుల ముందు వెలువడిన ఈ తీర్పు సంచలనం సృష్టిస్తోంది.

అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంనుంచి ఇమ్రాన్ ఖాన్ దౌత్యపరమైన ఒక రహస్య పత్రాన్నిఅనధికారికంగా సంపాదించారంటూ ఆయనపై అభియోగం నమోదైంది. ఇది అధికారిక రహస్యాల చట్టాన్ని అతిక్రమించడమేనంటూ ఆయనపైనా, ఆయన సహచరుడు ఖురేషీపైనా కేసు నమోదైంది. ఈ రహస్య పత్రాన్నే సైఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కేసుపై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. 2022లో అధికారం కోల్పోయాక ఇమ్రాన్ ఒక సభలో మాట్లాడుతూ,  తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలంటూ అమెరికా ప్రభుత్వం పంపించిన రహస్య పత్రం ఇదేనంటూ ఆయన సైఫర్ ను చేతిలో పట్టుకుని చూపిస్తూ ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News