Sunday, December 22, 2024

భయంతో అర్ధరాత్రి మోడీకి ఇమ్రాన్ ఖాన్ ఫోన్ !

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సైనిక సంక్షోభాన్ని నివారించడానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2019లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి అర్ధరాత్రి ఫోన్ చేశారు. బాలాకోట్ వైమానిక దాడులు, పుల్వామా ఉగ్ర దాడి తర్వాత ఈ పిరణామం చోటుచేసుకుంఇ. అయితే ఆ రాత్రి ప్రధాని మోడీతో మాట్లాడే అవకాశం రానప్పటికీ మరుసటి రోజు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత సైనిక సంక్షోభాన్ని నివారించే ప్రయత్నంలో ఇమ్రాన్ ఖాన్ మరుసటి రోజు 2019 ఫిబ్రవరి 27వ తేదీ అర్ధరాత్రి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భయాందోళనతో ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడేందుకు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని అప్పట్లో పాకిస్తాన్‌లో భారత హై కమిషనర్‌గా పనిచేసిన అజయ్ బిసారియా తన రాబోయే పుస్తకం ది ఆంగర్ మేనేజ్‌మెంట్: ది ట్రబుల్డ్ డిప్లొమాటిక్ రిలేషన్‌షిప్ బెట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనే పుసక్తంలో రాశారు.

పాకిస్తాన్ భూభాగంలోకి 9 భారతీయ క్షిపణులు డాది చేయనున్నాయని నిఘా వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందడంతో పాకిస్తాన్ భయాందోళనకు గురైంది. 2019 ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపేందుకు సన్నద్ధమై బాలాకోట్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. అదే ఏడాది ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో భారతీయ పారామిలిటరీ సిబ్బందిపై ఉగ్రవాదుల దాడికి సమాధానంగా భారత్ బాలాకోట్‌పై ఫిబ్రవరి 26న దాడులు జరిపింది. మరుసటి రోజు అప్పటి పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి తెహమినా జన్‌జువాకు పాక్ సైన్యం నుంచి ఒక సందేశం అందింది. భారత్ నుంచి 9 క్షిపణులు పాకిస్తాన్ వైపు గురిపెట్టి ఉన్నాయని, అవి ఏ క్షణమైనా పేలవచ్చన్నది ఆ సందేశం సారాంశం. వెంటనే విదేశాంగ కార్యదర్శి ఈ విషయాన్ని తమ నాయకులకు తెలియచేసి పరిస్థితిని తీవ్రతరం చేయవద్దని భారత్‌ను కోరాలని తమ రాయబారులను కోరారు. పరిస్థితి సంక్షోభంలో జారుతుండడంతో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అప్రమత్తమయ్యారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలని అర్ధరాత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటి పాకిస్తాన్ హై కమిషనర్ సోహాయిల్ మహమూద్ నుంచి ఢిల్లీలోని భార హైకమిషనర్‌కు అర్ధరాత్రి ఫోన్ చేశారు. పాకిస్తాన్ హై కమిషనర్ సొహాయిల్ మహమూద్ నుంచి ఢిల్లీలో ఉన్న నాకు అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. ప్రధాని మోడీతో మాట్లాడాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారని ఆయన చెప్పారు. మిద్దెపైన ప్రధాని ఉన్నారేమోనని చూశాను. ఆయన లేరన్న విషయాన్ని మహమూద్‌కు చెప్పాను. ఇమ్రాన్ ఖాన్ ఏదైనా అత్యవసర సందేశం చెప్పదలిస్తే నాకు చెబితే నేను ప్రధాని మోడీకి తెలియచేస్తానని చెప్పాను. ఆ రాత్రి నాకు మళ్లీ ఫోన్ కాల్ రాలేదు అని బిసారియా తన పుస్తకంలో రాశారు. అయితే ఆ రోజు రాత్రి ఢిల్లీలోని అమెరికా, బ్రిటన్ రాయబారుల భారత విదేశాంగ కార్యదర్శితో మాట్లాడారని, ఉద్రిక్తతను తగ్గించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని వారు చెప్పారని ఆయన పుస్తకంలో పేర్కొన్నారు. అంతేగాక ఉగ్రవాదం సమస్యను పరిష్కరించడానికి తీవ్రంగా కృషిచేయడానికి పాకిస్తాన్ సంసిద్ధతను తెలిపిందని కూడా వారు చెప్పారని ఆయన రాశారు.

మరుసటి రోజు తమ బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారని ఆయన వివరించారు. అయితే శాంతికి సూచనగా వర్ధమాన్ విడుదలను ఇమ్రాన్ ఖాన్ వర్ణించినప్పటికీ భారత్ తీసుకున్న ఘర్షణపూరిత వైఖరే దీనికి కారణమని బిసారియా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన ప్రధాని మోడీ ఈ ఘటనను ప్రస్తావిస్తూ అదృష్టవశాత్తు పైలట్‌ను భారత్‌కు తిప్పి పంపిస్తున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. లేకపోతే అది రక్తపాత రాత్రిగా ఉండేది అని వ్యాఖ్యానించడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News