Sunday, December 22, 2024

ఇమ్రాన్ పార్టీకి దక్కని బ్యాట్ గుర్తు

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) తమ ఎన్నికల గుర్తు ‘క్రికెట్ బ్యాట్’ ను కోల్పోయింది. ఈ మేరకు పాక్ సుప్రీం కోర్టు శనివారం అర్ధరాత్రి దాటాక తీర్పు వెలువరించింది. పిటిఐ సంస్థాగత ఎన్నికలను నిర్వహించలేదని పేర్కొంటూ ఆ పార్టీకి కేటాయించిన క్రికెట్ బ్యాట్ గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేయగా, పెషావర్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సంస్ధాగత ఎన్నికలను ధ్రువీకరిస్తూ ఈనెల 10న ఆ గుర్తును పునరుద్ధరించింది.

ఈ తీర్పును ఎన్నికల సంఘం పాకిస్థాన్ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఉభయ వర్గాల వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖాజీ ఫయీజ్ తమ సహ ఇద్దరు జడ్జీలతో సంప్రదించి రిజర్వు చేసిన తీర్పును శనివారం రాత్రి వెలువరించారు. సంస్థాగత ఎన్నికలు చెల్లబోవని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం రద్దు చేసిన ఎన్నికల గుర్తును పెషావర్ హైకోర్టు పునరుద్ధరించడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈ ఎన్నికల గుర్తు వివాదం డిసెంబర్ 22న ప్రారంభమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News