- Advertisement -
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ గుర్తు క్రికెట్ బ్యాట్ ను కోల్పోయాడు. ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఇ) ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్. అయితే పిటిఇ సంస్థాగత ఎన్నికలను నిర్వహించని కారణంగా ఆ పార్టీ ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేసింది.
దీనిపై ఇమ్రాన్ అప్పీలుకు వెళ్లగా కింది కోర్టు తీర్పును పెషావర్ కోర్టు కొట్టేసింది. అయితే పెషావర్ కోర్టు తీర్పుపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పిటిఇ ఎన్నికల గుర్తును రద్దు చేయాలని ఆదేశించారు. పెషావర్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పుపట్టారు.
- Advertisement -