Monday, December 23, 2024

అమెరికాకు అవిధేయత చూపి ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకుంటున్నారు:రష్యా

- Advertisement -
- Advertisement -

Imran Khan

న్యూఢిల్లీ:  వాషింగ్టన్‌కు అవిధేయత చూపినందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకుంటున్నారని, ఈ సంవత్సరం మాస్కోను సందర్శించినందుకు శిక్షించబడుతున్నారని రష్యా పేర్కొంది.  పాకిస్తాన్‌లో రాజకీయ గందరగోళంపై రష్యా, అమెరికాపై పూర్తి దాడిని ప్రారంభించింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 23-24 తేదీల్లో ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటన గురించి ప్రకటించిన వెంటనే, అమెరికన్లు, వారి పాశ్చాత్య సహచరులు ప్రధానమంత్రిపై మొరటుగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు, పర్యటన రద్దు చేయాలని అల్టిమేటం డిమాండ్ చేశారు’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవాను ఉటంకింస్తూ వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.

రష్యా దళాలు ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించిన ఫిబ్రవరి 25న ఇమ్రాన్ ఖాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మాస్కోలోని క్రెమ్లిన్‌లో కలిశారు. గత 23 ఏళ్లలో రష్యాను సందర్శించిన రెండవ పాక్ ప్రధానిగా ఖాన్ నిలిచారు. ఇదివరలో  ఏప్రిల్ 1999లో నవాజ్ షరీఫ్ సందర్శించారు. తన రష్యా పర్యటనపై విదేశీ శక్తి (అమెరికా) కలత చెందిందని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ఆరోపించారు.  అంతేకాక 69 ఏళ్ల పాకిస్తాన్ ప్రధాని తన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాల వెనుక విదేశీ కుట్ర ఉందని ఆరోపించారు. జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి ఆదివారం అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడానికి అదే కారణాన్ని పేర్కొన్నారు.

ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో, పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్  చీఫ్ ఇమ్రాన్ ఖాన్  విదేశీ కుట్రలో ప్రమేయం ఉన్న వ్యక్తిగా దక్షిణ మరియు మధ్య ఆసియా వ్యవహారాల అమెరికా సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూను పేర్కొన్నారు.  ప్రధాన మంత్రి విశ్వాస ఓటు నుండి బయటపడితే చిక్కులు తప్పవని అమెరికాలోని పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్‌ను లూ హెచ్చరించారని కూడా ఆయన తెలిపారు. ఇదిలావుండగా ఇమ్రాన్‌ ఖాన్‌ సూచనల మేరకు పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ ఆదివారం అసెంబ్లీని రద్దు చేశారు. అధికార పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్  కూటమిపై అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఈ చర్యకు పూనుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News