జర్దారీ, రియాజ్‌ల సాయం కోసం
ఇస్లామాబాద్ : తన పదవిని కాపాడుకునేందుకు పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ పలు స్థాయిలలో యత్నించాడు. దీనిని తెలియచేసే సంభాషణల ఆడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో ప్రచారం పొందింది. అవిశ్వాస తీర్మానపు చిక్కులు చుట్టుముట్టినప్పుడు ఇమ్రాన్ పాకిస్థాన్ మాజీ అధ్యక్షులు అసిఫ్ అలీ జర్దారీ, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి రియాజ్ హుస్సేన్‌లతో మాట్లాడినట్లు , గట్టెక్కించినట్లు ఈ సంభాషణలు వెల్లడించాయి. 32 సెకండ్ల ఆడియో క్యాసెట్‌లో జర్దారీ, రియాజ్ గొంతులు ఉన్నాయి. ఏ రోజున ఇమ్రాన్ ఆ ఇరువురితో మాట్లాడారనేది క్యాసెట్‌లో పొందుపర్చలేదు. తనకు ఇమ్రాన్ పలుసార్లు ఫోన్ చేసినట్లు రియాజ్ ఫోన్‌లో మాజీ అధ్యక్షులు జర్ధారికి చెప్పారు. దీనికి జర్దారీ స్పందిస్తూ అంతా చేయిదాటిపోయింది. ఇప్పుడేమీ చేయలేమని జర్దారీ బదులివ్వడం గురించి తెలిపే ఈ క్యాసెట్ ఇప్పుడు పెను దుమారానికి దారితీసింది.