Monday, December 23, 2024

జైల్లో పెట్టినా లొంగేది లేదు : ఇమ్రాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

లాహోర్ : దేశంలో న్యాయపాలన కోసం తన పోరాటం కొనసాగుతుందని, తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినా లొంగే ప్రసక్తే లేదని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం యూట్యూబ్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా, వాళ్లతో రాజీపడను, లొంగిపోను, దేశ భవిష్యత్తు, ప్రజల కోసం తాను పోరాటం చేస్తానని ఆయన ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, హింసకు ప్రేరేపించడం, దహన కాండ, హత్యాయత్నం, అవినీతి, మోసానికి సంబందించి దాదాపు 140 కేసులు ఆయనపై ఉన్నాయి. అయితే తాజాగా 19 కేసుల్లో ఇప్పటివరకు ఉన్న ముందస్తు బెయిల్ పొడిగింపు కోసం సోమవారం ఉదయం ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు.

ఈలోగా ఇమ్రాన్ ఖాన్‌ను ఆదివారం ఆయన జమాన్ పార్క్ నివాసంలో కలియడానికి ప్రయత్నించిన 30 పిటిఐ కార్యకర్తలను లాహోర్ పోలీస్‌లు అరెస్టు చేశారు. మే 9 నాటి హింసాత్మక సంఘటనలకు సంబందించి అరెస్టయిన వీరిని విడుదల చేయడంతో ఇమ్రాన్‌ను కలియడానికి వీరు ప్రయత్నించగా ప్రజావ్యతిరేక చట్టం కింద మళ్లీ వీరిని అరెస్ట్ చేయడం గమనార్హం. వీరిలో మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు షుమైలా సత్తార్ కూడా ఉన్నారు. ఇమ్రాన్‌ను కలిసి వచ్చిన సీనియర్ న్యాయవాది అజీజ్ భండారీని కూడా అరెస్టు చేశారు. మే 9 న పోలీస్ కమాండర్ హౌస్‌పై దాడికి పాల్పడినందునే సత్తార్‌ను అరెస్టు చేసినట్టు పోలీస్‌లు చెప్పారు. మే 9న దాదాపు 20 సైనిక స్థావరాలపై దాడి చేశారనే ఆరోపణలపై దాదాపు 10 వేల మంది పీటీఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News