Sunday, December 22, 2024

ఇమ్రాన్ ఖాన్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : అల్‌కాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో నిందితుడైన మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు పాకిస్థాన్ అకౌంటబులిటీ కోర్టు సోమవారం 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. పోలీస్ కస్టడీని పొడిగించాలని నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్‌ఎబి) అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. రావల్పిండి అడియాలా జైలులో జరిగిన ఈ కోర్టు విచారణకు ఇస్లామాబాద్ అకౌంటబులిటీ కోర్టు జడ్జి ముహమ్మద్ బషీర్ అధ్యక్షత వహించారు. అడియాలా జైలు లోనే ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ బందీగా ఉన్నారు.

వివిధ కేసులకు సంబంధించి అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో గత సెప్టెంబర్ 26 నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ విచారణ సందర్భంగా ఖాన్‌తోపాటు భార్య 49 ఏళ్ల బూషాబీబీ , ఖాన్ సోదరిలు అలీమా ఖానూమ్, నొరీన్ ఖానూమ్ కూడా హాజరయ్యారు. ఇదే కేసులో ఆదివారం అడియాలా జైలులో ఇమ్రాన్‌ఖాన్‌ను ఎన్‌ఎబి బృందం రెండు గంటలపాటు విచారించింది. నవంబర్ 15 నుంచి ఈ కేసులోనే విచారించడానికి అడియాలా జైలుకు ఎన్‌ఎబి బృందం తరచుగా వెళ్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News