Friday, November 22, 2024

పాక్ పార్లమెంట్‌లో నెగ్గిన ఇమ్రాన్

- Advertisement -
- Advertisement -

Imran Khan wins trust vote in parliament

 

ప్రతిపక్ష బాయ్‌కాట్ నడుమే ఓటింగ్

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ పార్లమెంట్‌లో శనివారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెగ్గారు. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షం ఓటింగ్‌ను బహిష్కరించింది. ఈ వారంలో పోటాపోటీగా సాగిన సెనెట్ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో ఇమ్రాన్ ప్రభుత్వ విశ్వసనీయతకు పరీక్ష ఏర్పడింది. దీనితో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు అయింది. ఈ సందర్భంగా 342 మంది సభ్యుల దిగువ సభలో ఇమ్రాన్ ఖాన్‌కు 178 ఓట్లు దక్కాయి. సాధారణ ఆధిక్యతకు 172 ఓట్లు అవసరం. ఈ సంఖ్యాబలాన్ని అధిగమించడంతో ఇమ్రాన్ ఈ బలపరీక్షలో స్వల్ప స్థాయిలో అయినా బయటపడ్డారు.

సభలో విశ్వాస పరీక్షపై ఓటింగ్ అసాధారణ రీతిలో ప్రతిపక్షం లేకుండానే జరిగింది. 11 పార్టీలతో కూడిన పాకిస్థాన్ డెమొక్రాటిక్ మూవ్‌మెంట్ (పిడిఎం) ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఈ బాయ్‌కాట్‌తో ఇమ్రాన్ ఖాన్ అవసరం అయిన మేరకు ఓట్లు పొందగలిగారు. దేశ ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఈ వారంలోనే జరిగిన సెనెట్ ఎన్నికలలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిటిఐ తరఫున పోటీ చేసి ఓడిపొయ్యారు. బుధవారం జరిగిన ఈ ఎన్నికలలో ఆయనను పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ ఓడించారు. ఈ వైఫల్యానికి బాధ్యత తీసుకుని ప్రధాని ఇమ్రాన్ పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి నిరాకరించిన ఇమ్రాన్ బలపరీక్షకు దిగారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News