Sunday, December 22, 2024

రెండు మితవాద మత పార్టీలతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పొత్తు ?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : కేంద్రం తోపాటు పంజాబ్, ఖైబర్ పక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌ల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇమ్రాన్‌ఖాన్ పార్టీ “పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పిటిఐ)” రెండు మితవాద మతపార్టీలతో పొత్తు కుదుర్చుకోడానికి నిర్ణయించింది. ఈమేరకు మజ్లిస్ వహాదత్ ఇముస్లిమీన్ (ఎండబ్లుఎం), జమాతీ ఇ ఇస్లామీ (జెఐ) పార్టీలతో చేతులు కలపనున్నట్టు పిటిఐ సమాచార కార్యదర్శి రవోఫ్ హస్సన్ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.

ఎండబ్లుంతో కలిసి కేంద్రం లోను, పంజాబ్ లోను, జెఐతో కలిసి ఖైబర్‌పక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ పార్టీ రెట్టింపు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఈ రెండు పార్టీలతో పొత్తు లేకుంటే పంజాబ్‌లో ఫెడరల్ లేదా ప్రావిన్సియల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే అభిప్రాయంతో పార్టీ ఉంది. ఈ రెండు పార్టీల పొత్తుతో పిటిఐ జాతీయ అసెంబ్లీలో 70 రిజర్వుడ్ స్థానాలతోను, అలాగే నాలుగు ప్రావిన్సియల్ అసెంబ్లీ స్థానాల్లో 156 రిజర్వుడ్ స్థానాలతో భాగం పంచుకోగలుగుతుంది. రిజర్వుడు స్థానాలను పార్టీలకు దామాషా ప్రాతిపదికన కేటాయించడమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News