Wednesday, December 25, 2024

నా భార్యకు టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం అందిస్తున్నారు: ఇమ్రాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: తన భార్యకు ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలిపి తినిపిస్తున్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రామన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. టాయిలెట్ కలిపిన ఆహారం తినడంతో తన భార్య బుష్రా బీబీకి కడుపు నొప్పితో బాధపడుతోందన్నారు. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తన భార్యకు తగిన వైద్య పరీక్షలు చేయడం లేదని, తాను ఎవరితో మాట్లాడకుండా ప్రత్యేక బ్యారెల్స్ చేశారని న్యాయవాది ఎదుట వాపోయారు. కస్టడీలో ఉన్నప్పుడు మీడియతో ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారని ఇమ్రాన్‌కు న్యాయవాది చురకలంటించారు. తన మాటలను కొందరు వక్రీకరించడంతో పాటు దుష్ప్రాచారం చేయడంతో తాను నిజాలు మాట్లాడుతున్నానని వివరణ ఇచ్చారు. ఇమ్రాన్ ఖాన్, ఆయన బుష్రాకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించి వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై కోర్టుకు తెలపాలని పోలీసులకు న్యాయవాది సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News