Tuesday, November 5, 2024

ఆర్కేపురం డివిజన్‌లో రూ. 40 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: ఆర్కేపురం డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని మహేశ్వరం నియోజకర్గం ఎంఎల్‌ఎ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఆర్కేపురం డివిజన్ అల్కాపురికాలనీ యు.జి.డి పైప్‌లైన్, ఈస్ట్ యాదవ్‌నగర్ కాలనీలో నాలా పనులకు రూ. 40 లక్షలతో చేపట్టిన పనులకు ఆమె ముఖ్యాతిథిగా హజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కేవలం వర్షపు నీరుపోయే విధంగా నాలాల అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, నియోజకవర్గంలో రూ.130 కోట్లతో నాలాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

ఈస్టు యాదవ్‌నగర్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని, స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దయానంద్ గుప్తా, మల్లేశం, స్థానిక కార్పొరేటర్ రాధ ధీరజ్‌రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, ఎ.ఈ ఈశ్వర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షులు నగేష్, రామాచారి, సాజీద్, కంచర్ల శేఖర్, కొండ శ్రీనివాస్ , శ్యాంగుప్తా, యాదవ్‌రెడ్డి, వెంకటేష్‌గౌడ్, తాడేపల్లి వెంకటేశంగుప్తా , పటేల్ సునీతారెడ్డి , శైలజ, స్వప్నలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News