ఎల్బీనగర్: హోటల్‌లో పని ఇచ్చినందుకు ఓమహిళ హోటల్ నాదేనని నకిలీ ధృవ పత్రాలు సృష్టించి ఓ జాతీయ బ్యాంకులో లోన్ తీసుకున్న ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోటల్ యజమాని పి. సురేష్, స్థల యాజమాని కూమారుడు కె .చంద్ర శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ప్లాట్ నెంబర్ 68ను 2015లో యజమాని కనీకారం కమలాక్షీ నుంచి వనస్థ్దలిపురానికి చెందిన సురేష్ లీజ్‌కు తీసుకొని బాలాజీ మెస్ పేరుతో హోటల్ నడుపుతున్నాడు. 2016లో కమలాక్షీ మృతి చెందడంతో ఆమె భర్త వెంగయ్య నుంచి లీజ్‌ను సురేష్ పొడిగించుకున్నాడు.
బాలాజీమెస్‌లో భరత్‌కూమార్ అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. కొవిడ్ సమయంలో భరత్‌కుమార్ మృతి చెందాడు. దీంతో ఆయన భార్య పత్తిపాక శోభ ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే 2020లో భరత్‌కుమార్ స్థానంలో శోభను సూపర్‌వైజర్‌గా నియమించాడు. హోటల్ యజమాని సురేష్ ఇతర వ్యాపారాలతో పని ఒత్తిడి కారణంగా హోటల్‌పై అలసత్వం వహించడంతో ఇదే అదునుగా భావించి పత్తిపాక శోభ చనిపోయిన కమలాక్షీ తన స్థ్దలాన్ని 2021లో లీజ్‌కు ఇచ్చినట్లు నకిలీ ధృవపత్రాలు సృష్టించింది. నకిలీ ధృవ పత్రాలు పేరు మీద ఒక జాతీయ బ్యాంకులో సుమారు రూ.25 లక్షలు రుణం తీసుకుంది. 2023 మొదటి నెలలో హోటల్‌పై లోన్ తీసుకున్నట్లు తెలుసుకున్న సురేష్ మొదటి నెలలో ఆమెను ప్రశ్నించాడు.
శోభ కొన్ని రోజులు సురేష్ మాటలు దాటేసింది. దీంతో సురేష్ శోభను గట్టిగా ప్రశ్నించే సరికి హోటల్ తనదేనని ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. దీంతో స్థల యాజమని చంద్రశేఖర్, హోటల్ యజమాని సురేష్ పూర్తి ఆధారాలతో , నకిలీ ధృవపత్రాలు సృష్టించనట్లు గత నెలలో శోభపై ఎల్బీనగర్ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. శోభను అరెస్టు చేయడంలో పోలీసులు తాత్సారం చేయడంతో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి ఆశ్రయించారు. ఏసీపీ శోభను అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశించనట్లు బాధితులు తెలిపారు. పోలీసులు ఎప్పుడు వెళ్లిన శోభ కనిపించడం లేదని త్వరలో అరెస్టు చేస్తామని తెలపడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో పట్టుకోస్తాం : ఎస్‌ఐ మధు
శోభ నగరం వదిలి వెళ్లిందని ఆమె వివరాల కోసం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని ఎల్బీనగర్ ఎస్‌ఐ మధు విలేకరుల అడిగిన ప్రశ్నకు తెలిపారు. ఎవరిని అతీగా నమ్మొద్దని ఈ సందర్భంగా ఎస్‌ఐ సూచించారు.