Sunday, December 22, 2024

మంత్రి కెటిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన వరంగల్ జనసేన ఇన్‌ఛార్జి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్ లో మంత్రి కెటిఆర్ సమక్షంలో జనసేన తూర్పు ఇన్‌చార్జి తాళ్లపెల్లి బాలు గౌడ్, వరంగల్ 42వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, ఉద్యమ నాయకుడు అచ్చ విద్యాసాగర్‌తో పాటు మరికొందరు శనివారం బిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్, బిఆర్‌ఎస్ వరంగల్ తూర్పు ఎన్నికల ఇన్‌ఛార్జి బండా ప్రకాష్, ఎంఎల్‌ఎ, తూర్పు నియోజకవర్గం బిఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News